ఏసీబీ కోర్టులో లక్ష్మీపార్వతికి చుక్కెదురు.. చంద్రబాబుపై పిటీషన్ కొట్టివేత

66
Lakshmi Parvati

దిశ, తెలంగాణ బ్యూరో : ఆంధ్రప్రదేశ్​ మాజీ సీఎం చంద్రబాబుపై లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు సోమవారం కొట్టివేసింది. చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాలని 2005లో లక్ష్మీపార్వతి పిటిషన్ దాఖలు చేశారు. 1987 నుంచి 2005 మధ్య చంద్రబాబు భారీగా ఆస్తులు పెంచుకున్నారని, వాటిపై విచారణ జరపాలని పిటిషన్‌లో లక్ష్మీపార్వతి కోరారు. 2004 ఎన్నికల అఫిడవిట్‌లో చంద్రబాబు చూపిన ఆస్తుల వివరాల ఆధారంగా ఆమె ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అయితే ఈ పిటిషన్‌పై 2005లో హైకోర్టు స్టే విధించింది. పెండింగ్‌లో ఉన్న స్టేలను ఎత్తివేయాలని సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో ఈ కేసులోనూ హైకోర్టు స్టేను ఎత్తివేసింది. స్టే ఎత్తివేసిన అనంతరం మళ్లీ విచారణను కొనసాగించింది. తాజాగా ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు ఏసీబీ కోర్టు ప్రకటించింది. పిటిషన్‌కు విచారణ అర్హత లేదని, ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..