కేసీఆర్‌కు షాక్.. ప్రభుత్వంపై ఎన్జీటీ ఆగ్రహం

56

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండా సచివాలయాన్ని కూల్చివేస్తున్నారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్జీటీలో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విచారణ జరిపిన ఎన్జీటీ.. రాష్ట్ర సచివాలయం కూల్చివేత, నిర్మాణంపై కౌంటర్‌ దాఖలు చేయడంలో జరిపిన జాప్యాన్ని ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయకపోవడంతో అసహనం వ్యక్తం చేసింది. పర్యావరణ అనుమతులు తీసుకున్నారో లేదో వెంటనే తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకోసం మరో 3 వారాలు సమయం ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..