సీఎం రేవంత్ రెడ్డి జ‌డ్చ‌ర్ల ప‌ర్య‌ట‌న‌కు ప‌టిష్ట బందోబ‌స్తు

by Nallavelli.Anjaneyulu |

తెలంగాణ రాష్ట్ర‌ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శుక్రవారం జడ్చర్ల పర్యటన సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాలకు సంబంధించి జిల్లా పోలీసు శాఖ చేపట్టిన బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ డి.జానకి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

సీఎం రేవంత్ రెడ్డి జ‌డ్చ‌ర్ల ప‌ర్య‌ట‌న‌కు ప‌టిష్ట బందోబ‌స్తు
X

దిశ‌, జ‌డ్చ‌ర్ల : తెలంగాణ రాష్ట్ర‌ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శుక్రవారం జడ్చర్ల పర్యటన సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాలకు సంబంధించి జిల్లా పోలీసు శాఖ చేపట్టిన బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ డి.జానకి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కరువేనా రిజర్వాయర్, ఉదండపూర్ రిజర్వాయర్, జడ్చర్ల పట్టణంలోని పబ్లిక్ మీటింగ్ ప్రాంగణం, హెలిప్యాడ్ ప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించి పోలీసు అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. జడ్చర్లలోని ASR గార్డెన్ లో నిర్వహించిన బ్రీఫింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ జానకి మాట్లాడుతూ సీఎం పర్యటన పూర్తయ్యే వరకు అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహించాలని సూచించారు. భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. భద్రతా చర్యల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. ఈ బందోబస్తు విధుల్లో మొత్తం 1406 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారు.

Next Story