- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీకి మళ్లీ షాక్!
by Shyam |
<p>దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో భారతీయ జనతా పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. గురువారం బీజేపి జెడ్పీటీసీ యమున పార్టీ విడగా, శుక్రవారం ముగ్గురు నగర పాలక సంస్థ కార్పొరేటర్ లు బీజేపిని విడి టీఆర్ఎస్ లో చేరారు. హైదరాబాద్ లో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఆధ్వర్యంలో నిజామాబాద్ అర్భన్ కు చెందిన ముగ్గురు బీజేపీ కార్పొరేటర్లు తెరాస పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ […]</p>

X
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో భారతీయ జనతా పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. గురువారం బీజేపి జెడ్పీటీసీ యమున పార్టీ విడగా, శుక్రవారం ముగ్గురు నగర పాలక సంస్థ కార్పొరేటర్ లు బీజేపిని విడి టీఆర్ఎస్ లో చేరారు. హైదరాబాద్ లో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఆధ్వర్యంలో నిజామాబాద్ అర్భన్ కు చెందిన ముగ్గురు బీజేపీ కార్పొరేటర్లు తెరాస పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజక పాలన చూసి, ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై నిజామాబాద్ బీజేపీ 8వ డివిజన్ కార్పొరేటర్ విక్రమ్ గౌడ్, 9వ డివిజన్ సాధు సాయి వర్ధన్, 50వ డివిజన్ బట్టు రాఘవేందర్(రాము) టీఆర్ఎస్ లో చేరినట్లు వారు తెలిపారు. వారికి మంత్రి, స్థానిక ఏమ్మెల్యే పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు.
Next Story






