డ్రగ్స్ తీసుకొమ్మని చెప్పారు : షోయబ్ అక్తర్

43

దిశ, స్పోర్ట్స్ : తాను క్రికెట్ ఆడే సమయంలో చాలా మంది డ్రగ్స్ తీసుకొమ్మని తనకు సలహా ఇచ్చినట్లు పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బౌలింగ్‌లో వేగం పెంచుకోవడానికి డ్రగ్స్ సహాయపడతాయని చెప్పారని.. కానీ, తాను వారి సలహాలను తిరస్కరించినట్లు అక్తర్ పేర్కొన్నాడు. పాకిస్తాన్‌ ప్రభుత్వ మాదక ద్రవ్యాల నిరోధన శాఖ నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అక్తర్ ఈ విషయాలను వెల్లడించారు. ‘కేవలం క్రికెట్‌లోనే కాకుండా క్రీడలను కెరీర్‌గా ఎంచుకున్న యువతను చాలా మంది ఇలా చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారు. నా కెరీర్ ప్రారంభంలోనే వేగంగా బంతులు వేసే వాడిని. అయితే 100 కిలోమీటర్ల కంటే వేగంగా వెయ్యాలంటే డ్రగ్స్ తీసుకొమ్మని చెప్పారు. కానీ నేనే తిరస్కరించాను’ అని అక్తర్ చెప్పుకొచ్చాడు. ఈ కార్యక్రమానికి చెందిన ఫొటోలను అక్తర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు.