- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సానియాను పెళ్లాడినందుకు.. : మాలిక్
<p>దిశ, స్పోర్ట్స్: భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌లు 2008లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. భారత్-పాక్ దేశాల మధ్య నెలకొన్న రాజకీయ విభేదాల నేపథ్యంలో ఈ పెండ్లి జరగడం అప్పట్లో పెద్ద వివాదానికి దారి తీసింది. కాగా, తాను సానియాను పెండ్లి చేసుకోవడంపై ఏనాడూ బాధపడలేదని, తాను క్రికెటర్‌నే తప్ప రాజకీయ నాయకుడిని కాదని మాలిక్ స్పష్టం చేశాడు. ‘ప్రేమించిన వ్యక్తిని పెండ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు వాళ్లు ఏ దేశానికి […]</p>

దిశ, స్పోర్ట్స్: భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌లు 2008లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. భారత్-పాక్ దేశాల మధ్య నెలకొన్న రాజకీయ విభేదాల నేపథ్యంలో ఈ పెండ్లి జరగడం అప్పట్లో పెద్ద వివాదానికి దారి తీసింది. కాగా, తాను సానియాను పెండ్లి చేసుకోవడంపై ఏనాడూ బాధపడలేదని, తాను క్రికెటర్‌నే తప్ప రాజకీయ నాయకుడిని కాదని మాలిక్ స్పష్టం చేశాడు. ‘ప్రేమించిన వ్యక్తిని పెండ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు వాళ్లు ఏ దేశానికి చెందిన వాళ్లు, మన దేశంతో సంబంధాలు ఎలా ఉన్నాయి అని ఎవరూ చూసుకోరు. ఒకరికి ఒకరం నచ్చామా లేదా అనే చూస్తాం. మేం కూడా మా ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో పెళ్లి చేసుకున్నాం’ అని షోయబ్ చెప్పాడు. కాగా, ఇంగ్లాండ్ పర్యటనకు ముందు సానియాను చూడటానికి హైదరాబాద్ వెళ్లేందుకు పీసీబీ షోయాబ్‌కు నెల రోజుల సెలవు మంజూరు చేసిన విషయం తెలిసిందే.






