ఎమ్మెల్యే ఆగ్రహం.. కాంట్రాక్టర్‌పై డ్రైనేజీ చెత్త పోసి..

by  |
ఎమ్మెల్యే ఆగ్రహం.. కాంట్రాక్టర్‌పై డ్రైనేజీ చెత్త పోసి..
X

దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలో కొద్దిరోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. రైల్వే స్టేషన్లలో సైతం వరద నీరు భారీగా చేరింది. వరదల కారణంగా డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై చెత్తగా భారీగా పేరుకుపోయింది. ఈ నేపథ్యంలో శివసేన ఎమ్మెల్యే్ దిలీప్ లాండే.. ముంబైలో డ్రైనేజీలు పొంగుతున్నా అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించే కాంట్రాక్టర్‌పై ఎమ్మెల్యే దిలీప్ డ్రైనేజీ చెత్త వేయించారు. నడి రోడ్డుపై కాంట్రాక్టర్‌ను మ్యాన్ హోల్ వద్ద కూర్చోబెట్టి కార్మికులతో చెత్తను పోసి ఆగ్రహం వ్యక్తపరిచారు.


Next Story