ఔట్ అండ్ ఔట్ కామెడీగా శివకార్తికేయన్ ‘డాన్’

by  |
ఔట్ అండ్ ఔట్ కామెడీగా శివకార్తికేయన్ ‘డాన్’
X

దిశ, వెబ్‌డెస్క్: డార్లింగ్ ఆఫ్ భాక్సాఫీస్, హీరో శివకార్తికేయన్ 19వ చిత్రం అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. లైకా ప్రొడక్షన్స్, శివకార్తికేయన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాకు ‘డాన్’ టైటిల్ ఫిక్స్ చేశారు. శిబి చక్రవర్తి దర్శకత్వంలో వస్తున్న సినిమాకు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తుండగా.. ఇందుకు సంబంధించి నోట్ రిలీజ్ చేశారు లైకా ప్రొడక్షన్స్ చైర్మన్, నిర్మాత సుబాస్కరన్ అలీ రాజా. శివకార్తికేయన్ ‘డాక్టర్’, ‘అయలాన్’ సినిమాలు ఇప్పటికే 2021 టాప్ ప్రిఫర్డ్ ఫిల్మ్స్‌లో ఉండగా… ‘డాన్’ మరింత మందిని థియేటర్లకు రప్పించే మూవీ అవుతుందన్నారు. ఔట్ అండ్ ఔట్ కామెడీగా వస్తున్న సినిమాను ప్రేక్షకులు హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేస్తారన్నారు. ఇక అనిరుధ్, శివకార్తికేయన్ కాంబినేషన్ బ్లాక్ బస్టర్‌గా నిలవడంలో మిస్ కాలేదని గుర్తు చేశారు సుబాస్కరన్ అలీ రాజా.

Next Story

Most Viewed