శివ కందుకూరి హీరోగా కొత్త చిత్రం

by  |
Shiva Kandukuri
X

దిశ, సినిమా: శివ కందుకూరి హీరోగా న్యూ మూవీ అనౌన్స్ అయింది. పీ19 ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై సురేష్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ద్వారా చవన్ ప్రసాద్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జూన్‌లో సినిమా షూటింగ్ ప్రారంభిస్తామన్న ప్రొడ్యూసర్.. సీతారాం ప్రసాద్ యూనిక్ స్టోరీ అందిస్తున్నారని తెలిపారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం సమకూరుస్తుండగా.. ‘జాతిరత్నాలు’ ఫేమ్ సిద్ధం మనోహర్ సినిమాటోగ్రఫీ అందించనున్నారని వెల్లడించారు. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ చేయనుండగా.. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు మేకర్స్. హైదరాబాద్‌లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక.. కొడైకెనాల్‌లో నెక్స్ట్ షెడ్యూల్ ఉంటుందన్నారు. ‘చూసీ చూడంగానే’ సినిమాతో శివ కందుకూరి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వగా.. తను నటించిన ‘మను చరిత్ర’, ‘గమనం’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.


Next Story

Most Viewed