కరోనాపై సమరం అంటే భారత్ పాక్ యుద్ధం కాదు: శివసేన ఎంపీ

by  |
కరోనాపై సమరం అంటే భారత్ పాక్ యుద్ధం కాదు: శివసేన ఎంపీ
X

ముంబై: కరోనాపై యుద్ధం అంటే భారత్- పాక్‌ల మధ్య యుద్ధం కాదని, దాన్ని ఎవరూ రాజకీయం చేయవద్దని బీజేపీ నేతలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఫైర్ అయ్యారు. మాజీ ముఖ్య మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ… ‘దేవేంద్ర ఫడ్నవీస్ మాజీ ముఖ్యమంత్రి. ప్రజలు లాక్‌డౌన్ కోరుకోవడం లేదని ఆయన చెప్పారు. నిజమే మాకు కూడా ఆ విషయం తెలుసు. ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఇంకో మార్గం ఏది’ అని ప్రశ్నించారు.

‘కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఢిల్లీలో కూర్చొని మాకు లెక్చర్లు ఇవ్వడం కాదు. ఆయనకు ఈ రాష్ట్రంతో కూడా సంబంధం ఉంది కదా. అందుకే ఇక్కడికి వచ్చి పరిస్థితిని పరిశీలించాలి’ అని అన్నారు. ఈ సందర్భంగా లాక్‌డౌన్ తప్ప మరో మార్గం లేదన్న సీఎం ఉద్దవ్ థాక్రే వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. ఇది ఒక్క మహారాష్ట్ర సమస్యే కాదు.. దేశం అంతటా కరోనా కేసులు పెరుగుతున్నాయని అన్నారు. అయితే దేశంలో లాక్‌డౌన్ అవసరం ఉందా.. మరేదైనా మార్గం ఉందా అన్నది పీఎం మోడీ నిర్ణయించగలరని అన్నారు. కానీ పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారాల షెడ్యూల్స్ తర్వాత కేంద్రం దీనిపై నిర్ణయం తీసుకుంటుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు.


Next Story

Most Viewed