బిగ్ బ్రేకింగ్.. అశ్లీల చిత్రాల కేసులో శిల్పా శెట్టి భర్త అరెస్ట్

by  |
బిగ్ బ్రేకింగ్.. అశ్లీల చిత్రాల కేసులో శిల్పా శెట్టి భర్త అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అశ్లీల చిత్రాలు సృష్టించి మొబైల్ యాప్స్ ద్వారా షేర్ చేశారనే ఆరోపణలతో ముంబై క్రైమ్ బ్రాంచ్‌ పోలీసులు కుంద్రాను అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఇదే విషయంపై స్పందించిన ముంబై కమిషనర్.. రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలను మొబైల్ యాప్స్‌ ద్వారా షేర్ చేశారనడానికి పక్కా ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా కూడా రాజ్ కుంద్రా ఉన్నాడని చెప్పారు. ఇది ఇలా ఉంటే అశ్లీల చిత్రాల కేసులో ఎంతమంది ప్రమేయం ఉందనేది చర్చనీయాంశం అయింది.

Next Story

Most Viewed