శిల్పా ఇంట్లో మహాభారత యుద్ధం… నారదుడు కొడుకే

by  |
శిల్పా ఇంట్లో మహాభారత యుద్ధం… నారదుడు కొడుకే
X

శిల్పా శెట్టి ఇంట్లో మహాభారత యుద్ధం జరిగింది. అదేంటి అనుకుంటున్నారా?. శిల్పా కొడుకు వియాన్ రాజ్ కుంద్రా నారదుడిగా మారి తల్లి మీద తండ్రికి, తండ్రి మీద తల్లికి చాడీలు చెప్పి… మోడర్న్ మహాభారత యుద్ధానికి కారకుడయ్యాడు. చివరగా ఇద్దరూ అస్త్రాలు సంధించుకున్నాక గానీ… కొడుకే తమ మధ్య వార్ సృష్టించాడని అర్థం చేసుకొలేకపోయారు శిల్పా, రాజ్ కుంద్రా దంపతులు. ఈ స్కిట్ తో సన్ డే ను ఫన్ డే అయిపోయిందని … చాలా ఎంజాయ్ చేశామని తెలుపుతూ సోషల్ మీడియా లో అప్ లోడ్ చేసింది శిల్పా. మీకు నచ్చిందా? అంటూ అభిమానులను అడుగుతోంది.

అవును నచ్చింది… మీ మోడర్న్ మహాభారతంలో నారదుడు చాలా బాగా నచ్చాడు అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి శిల్పా లాక్ డౌన్ సమయాన్ని అటు టిక్ టాక్ ఇటు యూట్యూబ్ లో యోగా, వంటకాలు… మధ్యలో ఫ్యామిలీతో … భలే ఎంజాయ్ చేస్తుంది. కాగా ఈ మధ్యే శిల్పా టిక్ టాక్ ఫాలోవర్స్ సంఖ్య 15 మిలియన్లకు చేరింది.

Next Story

Most Viewed