‘సారంగ దరియా’ సక్సెస్ క్రెడిట్ ఆయనదే : శేఖర్ కమ్ముల

by  |
‘సారంగ దరియా’ సక్సెస్ క్రెడిట్ ఆయనదే : శేఖర్ కమ్ముల
X

దిశ, సినిమా: ‘లవ్ స్టోరి’ మూవీలోని సారంగ దరియా పాట యూట్యూబ్ రికార్డ్స్ కొల్లగొట్టింది. 32 రోజుల్లో 100 మిలియన్ వ్యూస్ సాధించిన ఫస్ట్ సౌత్ ఇండియన్ లిరికల్ సాంగ్‌గా రికార్డ్ సెట్ చేసింది. ఈ విషయంపై స్పందించిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. ఈ పాట సక్సెస్ ముందుగానే ఊహించాను కానీ మరీ ఇంత భారీ రెస్పాన్స్ ఉంటుందని అనుకోలేదన్నారు. తమ టీంలో అందరూ భావోద్వేగంతో ఉన్నారని.. ఈ సక్సెస్ క్రెడిట్ మెయిన్‌గా సుద్దాల అశోక్ తేజకు దక్కుతుందన్నారు. జానపద గీతానికి అద్భుత సాహిత్యం అందించారని, క్యాచీ లిరిక్స్ వల్లే పాట ప్రేక్షకులకు అంతగా నచ్చిందన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ పవన్‌కు తొలి సినిమానే అయినా చాలా బాగా చేశారని, తనకు బ్రైట్ ఫ్యూచర్ ఉందని తెలిపారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీకి బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చిన శేఖర్ కమ్ముల.. ఈ పాట సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచేసిందని అభిప్రాయపడ్డారు. పాటలన్నీ హిట్ అయి మూవీని మ్యూజికల్ ‘లవ్ స్టోరి’గా మార్చేశాయని, ఏప్రిల్ 16న రిలీజ్ కానున్న చిత్రం తప్పకుండా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందన్నారు శేఖర్ కమ్ముల.



Next Story