నాకే ఇంగ్లీష్ రాదంటారా.. అయితే కాచుకోండి..! : బాలీవుడ్ నటి

by  |
నాకే ఇంగ్లీష్ రాదంటారా.. అయితే కాచుకోండి..! : బాలీవుడ్ నటి
X

దిశ, సినిమా : బిగ్ బాస్ ఫేమ్, నటి షెహ్నాజ్ గిల్ ప్రెట్టీనెస్‌కు నెటిజన్లు ఫిదా అవుతూనే ఉన్నారు. సూపర్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, ఇన్సోసెంట్ లుక్స్, నాటీ జోక్స్‌తో ఎప్పటికప్పుడు సోషల్ మీడియా అటెన్షన్ క్యాచ్ చేసే ఈ పంజాబీ సింగర్.. బిగ్ బాస్ తర్వాత ఆల్బమ్స్, వీడియో సాంగ్స్‌తో ఫుల్ బిజీగా మారిపోయింది. అయితే తను బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పటి నుంచే వచ్చీరాని ఇంగ్లీష్‌లో మాట్లాడటం వ్యూయర్స్‌కు నవ్వు తెప్పిస్తుండేది. తను ఇంగ్లీష్‌లో ఏ మాట మాట్లాడినా సరే, అభిమానులు నవ్వు ఆపుకోలేకపోయేవారు. ఈ మేరకు తన మాతృభాష పంజాబీతో హిందీ, ఇంగ్లీష్ కలిపి మాట్లాడుతూ అన్ని లాంగ్వేజెస్‌ను ఖూనీ చేస్తోందనే కామెంట్స్ కూడా వినిపించేవి. కాగా తను ఇంగ్లీష్ మాట్లాడే తీరుపై ఇప్పటికీ మీమ్స్, జోక్స్ పేలుతుండగా.. ఈ ట్రోల్స్‌కు తనదైన స్టైల్‌లో జవాబిచ్చింది షహ్నాజ్. ‘నాకే ఇంగ్లీష్ రాదంటారా.. ఇప్పుడు చూడండి’ అంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. సింగర్ జస్టిన్ బీబర్ ‘పీచెస్’ సాంగ్‌ పాడుతూ సోషల్ మీడియాలో క్లిపింగ్ పోస్ట్ చేసింది. ఈ వీడియోలో షహ్నాజ్ వాయిస్, ఇంగ్లీష్ ప్రొనౌన్స్ చేసే విధానంతో పాటు తన బ్యూటీకి ఇంటర్నెట్ ఫిదా కాగా.. తన కోస్టార్, బెస్ట్ ఫ్రెండ్, పార్ట్‌నర్ సిద్ధార్థ్ శుక్లా కూడా షెహ్నా్జ్‌ను పొగడ్తలతో ముంచెత్తడం విశేషం.



Next Story

Most Viewed