ఆయుష్మాన్ ‘డాక్టర్ జీ’లో సీనియర్ నటి.. ఎగ్జైట్ అవుతున్న డైరెక్టర్

by  |
Shefali Shah
X

దిశ, సినిమా: వెర్సటైల్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా లీడ్ రోల్ ప్లే చేస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘డాక్టర్ జీ’. ఇందులో మరో టాలెంటెడ్ యాక్ట్రెస్ జాయిన్ కానుంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మేకర్స్. జంగిల్ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీతో అనుభూతి కశ్యప్ డైరెక్టర్‌గా పరిచయంం కాబోతుండగా.. ఆయుష్మాన్ ఖురాన్ డాక్టర్‌గా కనిపించబోతున్నారు . ఇక ఆయనకు జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ నటిస్తోంది. కాగా ఈ సినిమాలో జాయిన్ కాబోతున్న ఆ సీనియర్ నటి ఎవరంటే..

బాలీవుడ్ సీనియర్ యాక్ట్రెస్ షెఫాలి షా. ‘డాక్టర్ జీ’ చిత్రంలో ఆమె డాక్టర్ నందిని పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. కాగా ‘షెఫాలి షా’ తమ చిత్రంలో నటిస్తున్నందుకు హ్యాపీగా ఫీలవుతున్నామని, ఆమెకు తను పెద్ద ఫ్యాన్ అని తెలిపిన డైరెక్టర్ అనుభూతి కశ్యప్.. ఫెఫాలిని డైరెక్ట్ చేసేందుకు ఎగ్జైట్ అవుతున్నానని చెప్పారు. ఇక ‘డాక్టర్ జీ’ లాంటి ఫెంటాస్టిక్ స్క్రిప్ట్‌లో భాగస్వామి కావడం అదృష్టంగా భావిస్తున్నానని షెఫాలి షా పేర్కొంది. కాగా తను నటించిన నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ‘అజీబా దాస్తాన్స్’ ఈ నెల 16న విడుదల కానుంది. ఇక ఆయుష్మాన్ ఇటీవల ‘అనేక్, చండీఘర్ కరే ఆశికి’ చిత్రాల షూటింగ్ పూర్తి చేయగా, వాటి విడుదల తేదీలను మేకర్స్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.



Next Story