- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షీనా బోరా బతికే ఉంది!… సీబీఐకి ఇంద్రాణీ ముఖర్జీ లేఖ
<p>ముంబై: కూతురు షీనా బోరా హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న మాజీ మీడియా ఎగ్జిక్యూటివ్ ఇంద్రాణీ ముఖర్జీ కొత్త ట్వీస్టు ఇచ్చారు. తన కూతురు బతికే ఉందని పేర్కొంటూ సీబీఐ అధికారులకు లేఖ రాశారు. దీనిపై విచారణ జరపాలని లేఖలో పేర్కొన్నారు. తాను జైలులో కలిసిన ఓ మహిళా ఖైదీ కశ్మీర్‌లో షీనా బోరాను చూసిందని తెలిపారు. అయితే ఈ మేరకు సీబీఐ చీఫ్‌కు లేఖ రాసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ‘ఆమె సీబీఐకి లేఖ రాసింది. […]</p>

ముంబై: కూతురు షీనా బోరా హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న మాజీ మీడియా ఎగ్జిక్యూటివ్ ఇంద్రాణీ ముఖర్జీ కొత్త ట్వీస్టు ఇచ్చారు. తన కూతురు బతికే ఉందని పేర్కొంటూ సీబీఐ అధికారులకు లేఖ రాశారు. దీనిపై విచారణ జరపాలని లేఖలో పేర్కొన్నారు. తాను జైలులో కలిసిన ఓ మహిళా ఖైదీ కశ్మీర్‌లో షీనా బోరాను చూసిందని తెలిపారు. అయితే ఈ మేరకు సీబీఐ చీఫ్‌కు లేఖ రాసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ‘ఆమె సీబీఐకి లేఖ రాసింది.
కానీ ఏం రాసిందో వివరాలు తెలియదు’ అని లాయర్ సనా ఖాన్ తెలిపారు. అంతేకాకుండా బెయిల్ కోసం దరఖాస్తు చేసినట్లు తెలిపారు. 49 ఏళ్ల ఇంద్రాణీ తన 25 ఏళ్ల కూతురు షీనా బోరాను హత్య చేసిన కేసులో బైకుల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. కాగా షీనా బోరా ఇంద్రాణీ మొదటి భర్తతో కలిగిన సంతానం కావడం గమనార్హం. అయితే కొన్ని రోజులుగా సోదరిగా పేర్కొంటూ ఇంద్రాణీతో ఉన్నప్పటికీ, వివాదాలు తలెత్తడంతో రెండో భర్త పీటర్ ముఖర్జీతో పాటు డ్రైవర్ తో కలిసి 2012లో హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. 2019లో పీటర్‌తో జైలులో ఉండగానే ఇంద్రాణీ విడాకులు తీసుకుంది. 2020లో పీటర్ జైలు నుంచి విడుదలయ్యారు. కాగా, తాజాగా షీనా బోరా బతికే ఉన్నారనే విషయం తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.






