ఆమె లిప్ స్టిక్ కోసం ఉద్యోగం మానేసిన వెయిటర్

by  |
lipstick
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా మనిషి జీవన విధానాన్నే మార్చేసింది. మాస్క్ శరీరంలో భాగమైపోయింది. శానిటౌజర్ నిత్యవసర వస్తువుగా మారింది. కరోనా నియంత్రణకు షాపింగ్ మాల్స్, హోటల్స్, సినిమా హాల్స్ సహా జాగ్రత్తలు పాటిస్తున్నాయి. అయితే అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. రెస్టారెంట్‌కు వచ్చిన కస్టమర్ లిప్ స్టిక్ చెడిపోతుందని మాస్క్ పెట్టుకోకపోవడంతో వెయిటర్ జాబ్ మానేసి వెళ్లిపోయింది.

ఓ యువతి తన సహచరుడితో రెస్టారెంట్‌కు వచ్చింది. అయితే ఆమె మాస్క్ పెట్టుకోకుండా లోపలికి వస్తుండడంతో వెయిటర్ అడ్డుకుని మాస్క్ లేనిది లోపలికి ప్రవేశం లేదని చెప్పింది. అయినా సదరు యువతి రెస్టారెంట్‌లోకి రావడానికి ప్రయత్నించింది. అక్కడే ఉన్న మేనేజర్ కు వెయిటర్‌పై ఫిర్యాదు చేసింది. అప్పటికే చిరాకుగా ఉన్న వెయిటర్ ‘‘ఇటువంటి వారివల్ల ఉద్యోగాలు కూడా పోతున్నాయి..ఉద్యోగాలు సంపాదించటం కష్టమైపోతోంది’’ అంటూ ఆమె తన క్యాప్, అప్రాన్ తీసేసి ఈ ఉద్యోగం వద్దంటూ వెళ్లిపోయింది.

వెయిటర్ అసహానాన్ని అర్థం చేసుకున్న యువతి వెంటనే తన దగ్గర ఉన్న మాస్క్ తీసిపెట్టుకుంది. కానీ అప్పటికే ఆమె రెస్టారెంట్ నుంచి వెళ్లిపోయింది. ఇంతకూ మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని ఆ యువతిని అడిగిన మేజనర్‌కు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది ఆమె. మాస్క్ పెట్టుకుంటే లిప్ స్టిక్ పాడవుతుందని చెప్పడంతో షాక్ తిన్నాడు మేనేజర్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.



Next Story

Most Viewed