- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెడలో హారంగా ప్రియురాలి రక్తం..
<p>దిశ, సినిమా: ఒక్కొక్కరి ప్రేమ కథ ఒక్కో రకంగా ఉంటుంది. ప్రేమలో మునిగితేలుతున్న వారు ఆ ఎడబాటును క్షణమైనా తట్టుకోలేరు. ఇక డేటింగ్‌లో ఉన్న వారిలో ఈ విరహవేదన గురించి చెప్పాల్సిన పనిలేదు. లవ్ బర్డ్స్‌లో ఏ ఒక్కరు దూర ప్రయాణం చేయాల్సి వచ్చినా ఇంకొకరు చాలా మిస్ అవుతుంటారు. అలాంటప్పుడు వారి జ్ఞాపకంగా ఉన్న వస్తువులను చూస్తూ కాలం గడిపేస్తుంటారు. అమెరికన్ యాక్ట్రెస్ మేఘన్ ఫాక్స్, సింగర్ మెషిన్ గన్ కెల్లీల ప్రేమ కథ కూడా […]</p>

దిశ, సినిమా: ఒక్కొక్కరి ప్రేమ కథ ఒక్కో రకంగా ఉంటుంది. ప్రేమలో మునిగితేలుతున్న వారు ఆ ఎడబాటును క్షణమైనా తట్టుకోలేరు. ఇక డేటింగ్‌లో ఉన్న వారిలో ఈ విరహవేదన గురించి చెప్పాల్సిన పనిలేదు. లవ్ బర్డ్స్‌లో ఏ ఒక్కరు దూర ప్రయాణం చేయాల్సి వచ్చినా ఇంకొకరు చాలా మిస్ అవుతుంటారు. అలాంటప్పుడు వారి జ్ఞాపకంగా ఉన్న వస్తువులను చూస్తూ కాలం గడిపేస్తుంటారు. అమెరికన్ యాక్ట్రెస్ మేఘన్ ఫాక్స్, సింగర్ మెషిన్ గన్ కెల్లీల ప్రేమ కథ కూడా ఇలాంటిదే. నార్మల్‌గా ఎవరైనా తమ పార్ట్‌నర్స్‌కు హ్యాండ్ కర్చీఫ్స్, గిఫ్ట్స్ గుర్తుగా ఇస్తుంటారు.. కానీ మేఘన్ మాత్రం తన బాయ్ ఫ్రెండ్‌కు డీఎన్‌ఏను జ్ఞాపకంగా ఇచ్చింది.
డేటింగ్‌లో ఉన్న తొలినాళ్లలో మేఘన్ ఫాక్స్.. బల్గేరియాలో షూటింగ్‌కు వెళ్లాల్సి వచ్చిందట. తనతో కలిసి వెళ్లేందుకు మెషిన్ గన్ కెల్లీకి వీసా లేకపోవడంతో వెళ్లలేకపోయాడు. ఆ టైమ్‌లో తననే తలుచుకునేందుకు బ్లడ్ డ్రాప్ సీసాను ఇవ్వడంతో.. దాన్ని చైన్‌లా మెడలో వేసుకున్నానని చెప్పాడు కెల్లీ. ఇందుకు సంబంధించిన ఫొటోలను గతంలో సోషల్ మీడియాలో షేర్ చేసిన కిల్లీ.. తాజాగా ‘ది ఎలెన్ షో’లో ఇందుకు సంబంధించిన స్టోరీపై ఓపెన్ అయ్యాడు.






