- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైద్యానికి స్పందిస్తున్న శశికళ
<p>బెంగళూరు: తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, ఏఐఏడీఎంకే బహిష్కృత నేత శశికళ స్పృహలోనే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. చికిత్సకు స్పందిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు బెంగళూరు మెడికల్ కాలేజీ, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఓ ప్రకటనలో పేర్కొంది. కానీ, ఆమె ఆరోగ్యపరిస్థితి మాత్రం క్లిష్టంగానే ఉన్నదని సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆమె ఈ నెల 27న విడుదల కానున్నారు. కానీ, ఇంతలో అనారోగ్యానికి గురికావడంతో బుధవారం తొలుత బౌరింగ్ హాస్పిటల్‌కు చేర్చారు. […]</p>

బెంగళూరు: తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, ఏఐఏడీఎంకే బహిష్కృత నేత శశికళ స్పృహలోనే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. చికిత్సకు స్పందిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు బెంగళూరు మెడికల్ కాలేజీ, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఓ ప్రకటనలో పేర్కొంది. కానీ, ఆమె ఆరోగ్యపరిస్థితి మాత్రం క్లిష్టంగానే ఉన్నదని సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆమె ఈ నెల 27న విడుదల కానున్నారు.
కానీ, ఇంతలో అనారోగ్యానికి గురికావడంతో బుధవారం తొలుత బౌరింగ్ హాస్పిటల్‌కు చేర్చారు. శ్వాసతీసుకోవడంలో సమస్య తలెత్తడంతో కరోనా టెస్టులు చేశారు. ముందు నెగెటివ్ వచ్చినప్పటికీ చివరికి కొవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. అనంతరం ఆమెను బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్‌కు చెందిన కొవిడ్ సెంటర్‌కు తరలించారు. శశికళ మధుమేహం, తీవ్రమైన థైరాయిడ్, మూత్రపిండాల్లో సమస్యలతోనూ బాధపడుతున్నారు.






