- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లి బాటలో శర్వా?
by Vadlamudi Anukaran |
<p>టాలీవుడ్ యంగ్ హీరోలు పెళ్లి బాట పట్టారు. ఒకరి వెనుక మరొకరు పెళ్లి పీటలెక్కుతున్నారు. నిఖిల్, నితిన్, రానా.. ఇప్పటికే సింగిల్ నుంచి మింగిల్ అయిపోగా.. మరో హీరో కూడా సింగిల్స్ బ్యాచ్‌కు గుడ్ బై చెప్పే అవకాశం ఉంది. తనదైన స్టైల్‌లో సినిమాలు చేసుకుంటూ హిట్లు కొడుతున్న శర్వానంద్ త్వరలో వివాహం చేసుకోబోతున్నాడని తెలుస్తోంది. చిన్ననాటి స్నేహితురాలితో ప్రేమలో ఉన్న తను.. ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన […]</p>

X
టాలీవుడ్ యంగ్ హీరోలు పెళ్లి బాట పట్టారు. ఒకరి వెనుక మరొకరు పెళ్లి పీటలెక్కుతున్నారు. నిఖిల్, నితిన్, రానా.. ఇప్పటికే సింగిల్ నుంచి మింగిల్ అయిపోగా.. మరో హీరో కూడా సింగిల్స్ బ్యాచ్‌కు గుడ్ బై చెప్పే అవకాశం ఉంది.
తనదైన స్టైల్‌లో సినిమాలు చేసుకుంటూ హిట్లు కొడుతున్న శర్వానంద్ త్వరలో వివాహం చేసుకోబోతున్నాడని తెలుస్తోంది. చిన్ననాటి స్నేహితురాలితో ప్రేమలో ఉన్న తను.. ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని .. చేసుకోబోయే అమ్మాయి పారిశ్రామికవేత్తగా రాణిస్తోందని టాక్.
ఇక సినిమా విషయానికి వస్తే ‘శ్రీకారం’ సినిమాతో బిజీగా ఉన్న శర్వా.. అజయ్ భూపతి డైరెక్షన్‌లో ‘మహాసముద్రం’ సినిమాకు కూడా ఓకే చెప్పాడు. ఇందులో హీరో సిద్దార్థ్ కూడా మరో కథానాయకుడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
Next Story






