అట్లీ డైరెక్షన్‌లో షారుక్ డ్యుయల్ రోల్

by  |
అట్లీ డైరెక్షన్‌లో షారుక్ డ్యుయల్ రోల్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. దాదాపు రెండేండ్ల తర్వాత సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న ‘పఠాన్’ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్న కింగ్ ఖాన్ షారుక్.. రాజ్‌కుమార్ హిరానీ డైరెక్షన్‌లో మరో మూవీ చేస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో షారుక్ డ్యూయల్ రోల్ చేయబోతున్నారు అని సమాచారం. తండ్రి పాత్రలో రా ( RAW) ఏజెంట్‌గా కనిపించబోతున్న షారుక్.. గ్యాంగ్‌స్టర్‌గా ఉన్న కొడుకును పట్టుకోవడం కథ కాగా, టేకింగ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుందట.

డూప్లికేట్, డాన్ సినిమాల తర్వాత షారుఖ్ డ్యూయల్ రోల్ చేస్తున్న సినిమా ఇదే కాగా, పఠాన్ సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. మ్యాగ్జిమమ్ 2021 మిడిల్ నుంచి షూటింగ్ ప్రారంభించే చాన్స్ ఉండగా ఇప్పటికే ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ అయినట్లు సమాచారం.



Next Story