ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బాలీవుడ్ హీరో.. యాసిడ్ అటాక్ సర్వైవర్స్‌కు సాయం

by  |
sharukh khan
X

దిశ, సినిమా: కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కరోనా సమయంలో మీర్ ఫౌండేషన్ ద్వారా భారీ విరాళాలు అందించడంతో పాటు దేశవ్యాప్తంగా సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు పీపీఈ కిట్స్, మాస్క్‌లు అందించి వారికి సపోర్ట్ చేశారు. అదే టైంలో మీర్ ఫౌండేషన్..యాసిడ్ అటాక్‌తో బాధపడుతున్న మహిళలకు సపోర్ట్‌గా నిలుస్తుందని ప్రామిస్ చేశారు షారుఖ్. మాట ఇచ్చినట్లుగానే యాసిడ్ అటాక్ సర్వైవర్స్‌కు ఆర్థికంగా సహాయం అందించడంతో పాటు శస్త్ర చికిత్సలు చేయించిన షారుఖ్.. వారందరితో వర్చువల్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రస్తుతం వారి జీవితాలు ఎంత సంతోషంగా ఉన్నాయో తెలుసుకున్నారు. దాదాపు తొమ్మిది నిమిషాలకు పైగా ఉన్న వీడియోలో వారిని కుశల ప్రశ్నలు అడిగి తన మాటలతో చిల్ చేశాడు.

ఈ క్రమంలో ఒకమ్మాయి తన ఫొటోను గోరింటాకుతో టాటూగా వేయించుకోగా, తనను మరీ రొమాంటిక్‌ చేసేస్తున్నారన్న షారుఖ్.. తన తల్లి చిన్నతనంలో సమ్మర్‌లో చేతికి మెహెందీ పెట్టేదని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారిలో స్ఫూర్తి నింపేందుకు ‘కల్ హో న హో’ పాట కూడా పాడిన షారుఖ్.. ఓ యాసిడ్ అటాక్ సర్వైవర్‌కు ఈ మధ్యే పుట్టిన కొడుకు గురించి అన్ని విషయాలు తెలుసుకుని బాద్ షా అనిపించుకున్నాడు.

Next Story

Most Viewed