షారుఖ్, కార్తీక్ కాంబినేషన్..

by  |
షారుఖ్, కార్తీక్ కాంబినేషన్..
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, యంగ్ హ్యాండ్ సమ్ కార్తీక్ ఆర్యన్ కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది. షారుఖ్ ప్రొడక్షన్ హౌజ్ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్‌లో ప్రస్తుతం దాదాపు ఆరు ప్రాజెక్టులు తెరకెక్కుతుండగా.. కార్తీక్ చేయబోయే ప్రాజెక్ట్ ఇందులో ఒకటి. ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ పూర్తి కాగా.. వచ్చే ఏడాది మిడిల్ నుంచి సెట్స్ మీదకు వెళ్లాలని భావిస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. కార్తీక్ కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నా.. డేట్స్ చెక్ చేసుకుని ఫైనల్ చేసే అవకాశం ఉందని బాలీవుడ్ టాక్. ఈ సినిమాపై సైన్ చేయడమే తరువాయి కాగా.. కార్తీక్, షారుఖ్ కాంబినేషన్ కోసం సూపర్ ఎగ్జైటింగ్‌గా ఉన్నారు ఫ్యాన్స్.

మరోవైపు షారుఖ్ 2018లో ‘జీరో’ సినిమాలో చివరగా కనిపించగా.. మళ్లీ ‘పఠాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకునే, జాన్ అబ్రహం ప్రధాన పాత్రల్లో కనిపించబోతుండగా.. సల్మాన్ ఖాన్ గెస్ట్ అప్పియరెన్స్ కూడా ఉండనుందట.


Next Story

Most Viewed