- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిరుద్యోగులను చంపిన నర హంతకుడు కేసీఆర్.. షర్మిల తీవ్ర ఆరోపణలు
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : నిరుద్యోగుల ఆత్మబలిదానాల మీద పదవులు అనుభవిస్తూ, నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను చంపుతున్న హంతకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని వైఎస్సార్తెలంగాణ పార్టీ చీఫ్షర్మిల బుధవారం ట్విట్టర్వేదికగా మండిపడ్డారు. కేసీఆర్‌కు ఉద్యమకారుడినని చెప్పుకోవడానికి సిగ్గుండాలని దుయ్యబట్టారు. కేసీఆర్‌కు కనికరం కూడా లేదని, ఇంకెంత మందిని బలితీసుకొంటే నోటిఫికేషన్లు వేస్తారు దొర అని సెటైర్లు వేశారు. ఎవరో చస్తే నాకేంటి అనుకుంటున్న కేసీఆర్‌కు కనీసం చీమ కుట్టినట్టుగా కూడా లేదన్నారు. కేసీఆర్‌కు సీట్లు, ఓట్ల మీదున్న […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : నిరుద్యోగుల ఆత్మబలిదానాల మీద పదవులు అనుభవిస్తూ, నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను చంపుతున్న హంతకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని వైఎస్సార్తెలంగాణ పార్టీ చీఫ్షర్మిల బుధవారం ట్విట్టర్వేదికగా మండిపడ్డారు. కేసీఆర్‌కు ఉద్యమకారుడినని చెప్పుకోవడానికి సిగ్గుండాలని దుయ్యబట్టారు. కేసీఆర్‌కు కనికరం కూడా లేదని, ఇంకెంత మందిని బలితీసుకొంటే నోటిఫికేషన్లు వేస్తారు దొర అని సెటైర్లు వేశారు.
ఎవరో చస్తే నాకేంటి అనుకుంటున్న కేసీఆర్‌కు కనీసం చీమ కుట్టినట్టుగా కూడా లేదన్నారు. కేసీఆర్‌కు సీట్లు, ఓట్ల మీదున్న ఆరాటం యువత ప్రాణాలు మీద లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఏడాది దాదాపు 20 మందికి పైగా నిరుద్యోగులను చంపిన హంతకుడు కేసీఆర్అని ఆరోపించారు. మరో నిరుద్యోగి ప్రాణం పోకముందే నోటిఫికేషన్లు వేయాలని, లేదంటే రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.
Next Story






