తమిళ‌నాట కొత్త ఫ్రంట్.. నేనే సీఎం అంటున్న కమల్‌హాసన్!

by  |
kamal-hassaan
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి మార్చి చివరి వారంలో ఎన్నికలు ఉంటాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ‘కోడ్’ అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. అస్సాం, వెస్ట్ బెంగాల్ మినహా మిగతా రాష్ట్రాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలోనే ద్రవిడ రాజకీయాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇదివరకు అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్న నటుడు శరత్‌కుమార్ తాజాగా ‘మక్కల్ నిధి మయ్యమ్’ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్‌తో కలిసి కొత్త కూటమిని ఏర్పాటు చేయనున్నారు.వీరి అధ్యర్యంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు కమల్ ఆసక్తిగా కనబరుస్తు్న్నారు. అంతేకాకుండా, మూడో కూటమి తరఫున సీఎం అభ్యర్థి తానేనని కమల్ హాసన్ ప్రకటించుకున్నారు. తమతో కలిసేందుకు ఏ పార్టీ అయినా ముందుకు రావొచ్చని ఆయన పిలుపునిచ్చారు.

శరత్‌కుమార్ తనతో కలిసిరావడం శుభపరిణామం ఈ సందర్భంగా కమల్ వ్యాఖ్యానించారు. కాగా, ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్ కాంగ్రెస్‌తో జట్టుకట్టాలని భావిస్తే.. అధికార అన్నాడీఎంకే పార్టీ బీజేపీతో కూటమి ఏర్పాటు విషయమై చర్చసాగనుంది.ఈ క్రమంలోనే కేంద్రహాంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ చెన్నై పర్యటనకు వచ్చారు.


Next Story

Most Viewed