జానీ మాస్టర్‌పై యంగ్ హీరో ఫైర్.. కోలీవుడ్‌లో రచ్చ

by  |
Shanthanu Bhagyaraju ..Johny Master
X

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ హీరో శంతను భాగ్యరాజ్ ‘మాస్టర్, పావ కథైగల్’ సిరీస్‌లో నటనకు బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకున్నాడు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శంతను..ఏ ఇష్యూ మీద అయినా రియాక్ట్ అయ్యేందుకు సిద్ధంగా ఉంటాడు. ఈ క్రమంలో ఇప్పటికే ధనుష్ 43వ సినిమాకు కొరియోగ్రఫర్‌గా వర్క్ చేసిన జానీ మాస్టర్..లేటెస్ట్‌గా ఇళయ దళపతి విజయ్ 65వ సినిమాకు కూడా సైన్ చేశాడు. ఈ విషయాన్నే జానీ మాస్టర్ తన ట్విట్టర్ అకౌంట్‌ ద్వారా తెలపగా ఓ తమిళ నెటిజన్ దీనిపై రిప్లై ఇచ్చాడు. శోభి, దినేష్, శ్రీధర్, సతీష్, షెరిఫ్, రాజు సుందరం మాస్టర్ కొరియోగ్రఫి బోర్ కొట్టిందని, జానీ మాస్టర్ కొరియోగ్రఫితో కొత్తగా ఉంటుందని ట్వీట్ చేశాడు.

https://twitter.com/imKBRshanthnu/status/1376748166830125057?s=20

దీంతో శంతను భాగ్యరాజ్ రాజు సదరు నెటిజన్‌పై ఫైర్ అయ్యాడు. శోభి, దినేష్, శ్రీధర్, షెరిఫ్, సతీష్ మాస్టర్స్ కొరియోగ్రఫీని చాలా ఏళ్లుగా తనతో పాటు తమిళ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారని, బోర్ కొట్టిందని కామెంట్ చేయొద్దని సూచించాడు. జానీ మాస్టర్ కూడా ఎక్స్‌ట్రీమ్‌లీ టాలెంటెడ్, తనను ప్రోత్సహిద్దాం కానీ ఇతరులను కించపరచకూడదని పోస్ట్ పెట్టాడు.



Next Story

Most Viewed