- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కులపెద్దల రాక్షసత్వం.. ఒకరి ఆత్మహత్య
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆరేళ్లుగా ఓ హత్యకేసులో నిందితుడిగా జైలు జీవితం అనుభవించాడు ఓ యువకుడు. ఇటీవల కేసు కొట్టివేయడంతో మంగళవారం విడుదలై నేరుగా గ్రామానికి వెళ్లిన ఇప్ప శంకర్ అనే యువకుడిని గ్రామస్తులు పెద్ద షాక్ ఇచ్చారు. ఏకంగా శంకర్ కుటుంబాన్ని బహిష్కరించారు కులపెద్దలు. మళ్లీ కులంలో కలవాటంటే రూ.3 లక్షలు కట్టాలని డిమాండ్ చేశారు. దీంతో తీవ్రమనోవేధనకు గురైన శంకర్ కుల పెద్దలపై అల్లాదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సైతం కేసును పట్టించుకోకపోవడంతో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఆరేళ్లుగా ఓ హత్యకేసులో నిందితుడిగా జైలు జీవితం అనుభవించాడు ఓ యువకుడు. ఇటీవల కేసు కొట్టివేయడంతో మంగళవారం విడుదలై నేరుగా గ్రామానికి వెళ్లిన ఇప్ప శంకర్ అనే యువకుడిని గ్రామస్తులు పెద్ద షాక్ ఇచ్చారు. ఏకంగా శంకర్ కుటుంబాన్ని బహిష్కరించారు కులపెద్దలు. మళ్లీ కులంలో కలవాటంటే రూ.3 లక్షలు కట్టాలని డిమాండ్ చేశారు. దీంతో తీవ్రమనోవేధనకు గురైన శంకర్ కుల పెద్దలపై అల్లాదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సైతం కేసును పట్టించుకోకపోవడంతో అర్ధరాత్రి పొలంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు తన ఆవేదన మొత్తం వీడియోలో రికార్డు చేసి, బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్‌లో చోటుచేసుకుంది.
Next Story






