Shanaya Kapoor: సోషల్ మీడియాలో షనయ చార్మింగ్ పిక్స్.. నెటిజన్లు ఫిదా

by  |
Shanaya Kapoor
X

దిశ, సినిమా: అప్ కమింగ్ యంగ్ హీరోయిన్ షనయా కపూర్‌ యూత్‌ సెన్సేషన్‌గా మారిపోయింది. త్వరలో ఇండస్ట్రీకి ఎంటర్ అవుతుండటంతో అటు ఆర్ట్ ఇటు ఫ్యాషన్‌పై కాన్సంట్రేట్ చేస్తున్న భామ.. నెటిజన్ల అటెన్షన్ క్యాచ్ చేయడంలో సక్సెస్ అవుతోంది. కజిన్ జాన్వీ కపూర్ ‘గుంజన్ సక్సేనా : ది కార్గిల్ గర్ల్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన ఆమె.. బెస్టీస్ అనన్యా పాండే, సుహానా ఖాన్‌లతో కలిసి ఎప్పటికప్పుడు యూనిక్ ఫొటోలు అప్‌లోడ్ చేస్తూనే ఉంది. తన డ్యాన్స్ వీడియోలతోనూ సపరేట్ ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకున్న షనయ.. లేటెస్ట్ పోస్ట్ వైరల్ అయింది. వైట్ అండ్ వైట్ అవుట్ ఫిట్‌లో ఫ్యాబులస్‌గా కనిపిస్తున్న భామ.. న్యూట్రల్ మేకప్‌తో అదరగొట్టేసింది. ఈ చార్మింగ్ ఫొటోస్‌పై నెటిజన్లు బెస్ట్ కాంప్లిమెంట్స్ అందిస్తున్నారు. ఈ క్రమంలో షనయ డాడీ సంజయ్ కపూర్ ఈ పోస్ట్‌పై రియాక్ట్ అయ్యాడు. ‘బెటా.. నీ ఆబ్స్‌ ఇస్తావా?’ అంటూ కామెంట్ చేశాడు.

Next Story

Most Viewed