- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒంటరి మహిళలే అతని టార్గెట్
<p>దిశ, వెబ్ డెస్క్: ఒంటరిగా వెళుతున్న మహిళలను టార్గెట్ చేస్తూ… చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న వ్యక్తిని శంషాబాద్ రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను శంషాబాద్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శంషాబాద్ ఎసిపి అశోక్ కుమార్ వెల్లడించారు. వివరాల్లోకి వెళితే… మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంకు చెందిన ముదావత్ రవినాయక్ సరూర్ నగర్ లో నివాసం ఉంటూ హోంగార్డుగా విధులు నిర్వహించేవాడు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తూ చెడు వ్యసనాలకు బానిసై స్నాచింగ్ […]</p>

దిశ, వెబ్ డెస్క్: ఒంటరిగా వెళుతున్న మహిళలను టార్గెట్ చేస్తూ… చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న వ్యక్తిని శంషాబాద్ రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను శంషాబాద్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శంషాబాద్ ఎసిపి అశోక్ కుమార్ వెల్లడించారు. వివరాల్లోకి వెళితే… మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంకు చెందిన ముదావత్ రవినాయక్ సరూర్ నగర్ లో నివాసం ఉంటూ హోంగార్డుగా విధులు నిర్వహించేవాడు.
మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తూ చెడు వ్యసనాలకు బానిసై స్నాచింగ్ లకు పాల్పడుతూ పట్టుబడిన రవి నాయక్… గతంలో జైలుకు కూడా వెళ్ళాడు. జైలుశిక్ష పడిన రవినాయక్ ను అధికారులు ఉద్యోగం నుంచి తొలగించారు. తాజాగా శంషాబాద్ లో స్నాచింగ్ లకు పాల్పడిన రవినాయక్ ను ఎస్ఓటి పోలీసుల సహకారంతో శంషాబాద్ రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శంషాబాద్, శంషాబాద్ ఎయిర్ పోర్టు, అబ్దుల్లాపూర్ మెట్, ఆదిభట్ల పోలీస్ స్టేషన్ ల పరిధిలో నిందితుడు రవినాయక్ స్నాచింగ్ లకు పాల్పడినట్లు ఏసీపీ అశోక్ కుమార్ గౌడ్ తెలిపారు. 5 కేసులకు సంబంధించి నిందితుడి వద్దనుంచి 7 తులాల బంగారం, 6 తులాల వెండి ఆభరణాలు,1 పల్సర్ బండిని స్వాధీనం చేసుకుని నిందితుడు రవి కుమార్ ను రిమాండ్ కు తరలించారు. నిందితుల్ని చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఓటి పోలీసులకు ఏసీపీ అశోక్ కుమార్ పోలీస్ స్టేషన్ తరఫున రివార్డు అందజేశారు.






