- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘శాకుంతలం’ : సమంత ఇష్టసఖిగా తమిళ నటి
by Jakkula Samataha |
<p>దిశ, సినిమా : టాలెంటెడ్ హీరోయిన్ సమంత అక్కినేని టైటిల్ రోల్ ప్లే చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘శాకుంతలం’. దర్శకులు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ఈ సుందర దృశ్య కావ్యంలో శకుంతల ఇష్టసఖిగా తమిళ భామను తీసుకోబోతున్నారని సమాచారం. ‘అరువి’ సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న అదితి బాలన్‌ను ఈ పాత్రకు ఫైనల్ చేశారని తెలుస్తోంది. అందాల శకుంతల ఇష్టసఖి ప్రియంవద పాత్ర ద్వారా అదితి బాలన్ తెలుగు తెరకు పరిచయం కానుండగా.. ముందుగా ఈ పాత్ర […]</p>

X
దిశ, సినిమా : టాలెంటెడ్ హీరోయిన్ సమంత అక్కినేని టైటిల్ రోల్ ప్లే చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘శాకుంతలం’. దర్శకులు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ఈ సుందర దృశ్య కావ్యంలో శకుంతల ఇష్టసఖిగా తమిళ భామను తీసుకోబోతున్నారని సమాచారం. ‘అరువి’ సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న అదితి బాలన్‌ను ఈ పాత్రకు ఫైనల్ చేశారని తెలుస్తోంది.
అందాల శకుంతల ఇష్టసఖి ప్రియంవద పాత్ర ద్వారా అదితి బాలన్ తెలుగు తెరకు పరిచయం కానుండగా.. ముందుగా ఈ పాత్ర కోసం తెలుగు భామ ఈషా రెబ్బాను ఎంచుకున్నారు. అయితే అనుకోని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నుంచి ఈషా తప్పుకోగా, ఈ అవకాశం అదితిని వరించింది. గుణ టీమ్ వర్క్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూరుస్తుండగా.. సామ్ ప్రీలుక్‌కు మంచి మార్కులు పడ్డాయి.
Next Story






