షేక్‌పేట ఎమ్మార్వో సుజాత భర్త సూసైడ్

by  |
షేక్‌పేట ఎమ్మార్వో సుజాత భర్త సూసైడ్
X

దిశ, క్రైమ్‌బ్యూరో: షేక్‌పేట ఎమ్మార్వో సుజాత భర్త అజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం చిక్కడపల్లిలోని అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఈనెల 5న బంజారాహిల్స్‌‌లోని ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం ఆర్‌ఐ నాగార్జున‌రెడ్డి రూ.15లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడగా… కేసు విచారణలో భాగంగా ఎమ్మార్వో సుజాత నివాసంలో సోదాలు నిర్వహించిన ఏసీబీకి రూ.30లక్షలు లభించాయి. అయితే డబ్బుల విషయంపై ఎమ్మార్వో సుజాత స్పష్టమైన సమాధానం చెప్పకపోవడంతో అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తీవ్ర మానసిక క్షోభవకు గురైన అజయ్ కుమార్… గాంధీనగర్ నివాసం నుంచి చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలోని తన సోదరి నివాసం లలిత అపార్ట్‌మెంట్‌కు మారాడు. బుధవారం ఉదయం 7.30 గంటల సమయంలో ఫోన్ మాట్లాడుతూ ఐదో అంతస్తు పైకి వెళ్లి అక్కడి నుంచి దూకాడు. వెంటనే కుటుంబ సభ్యులకు వాచ్‌మెన్ సమాచారం అందించి… తీవ్రగాయాలైన అజయ్‌ను సోమాజిగూడలోని తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు.

ఎమ్మార్వో సుజాతకు మధ్యంతర బెయిల్‌

అవినీతి కేసులో అరెస్ట్‌ అయిన షేక్‌పేట ఎమ్మార్వో సుజాతకు ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఆమె భర్త అజయ్‌కుమార్‌ ఆత్మహత్య చేసుకోవడంతో మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని కుటుంబసభ్యులు పిటిషన్ దాఖలు చేయగా 21రోజుల పాటు బెయిల్‌కు న్యాయస్థానం అంగీకరించింది. అయితే బెయిల్‌పై వచ్చిన సుజాతకు ఆమెభర్త సూసైడ్ చేసుకున్న విషయం ఇంటికొచ్చే వరకూ కుటుంబ సభ్యులు చెప్పలేదు. గురువారం ఉదయం అంబర్‌పేట లేదా బన్సీలాల్‌పేట శ్మశాన వాటికలో అజయ్కుమార్ అంత్యక్రియలు జరగనున్నాయి.



Next Story

Most Viewed