బ్రేకింగ్.. జైలు నుంచి విడుదలైన ఆర్యన్ ఖాన్.. కన్నీరు పెట్టిన షారుఖ్

by  |
బ్రేకింగ్.. జైలు నుంచి విడుదలైన ఆర్యన్ ఖాన్.. కన్నీరు పెట్టిన షారుఖ్
X

దిశ, సినిమా : బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దాదాపు 25 రోజులు జైల్లోనే ఉన్న సంగ‌తి తెలిసిందే. అక్టోబర్‌ రెండో తేదీన ముంబై తీరంలోని క్రూయిజ్‌ షిప్‌లో రేవ్‌ పార్టీ జ‌రుగుతుంద‌నే స‌మాచారంతో నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు దాడులు జరిపారు. ఈ క్రమంలో ఆర్యన్‌తో పాటు ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. అప్పటి నుంచి ఆర్యన్ ముంబైలోని ఆర్ధర్‌ రోడ్‌ జైలులోనే ఉన్నాడు.

అతడి బెయిల్ కోసం ఎన్నో నాటకీయ, రాజకీయ, పరిణామాల చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా శుక్రవారం ఆర్యన్‌కు బాంబే హైకోర్టు 14 షరతులతో పాటు లక్ష రుపాయల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. అనంతరం బెయిల్ మంజూరు చేసింది. దీంతో నటి జూహీ చావ్లా షూరిటీగా సంతకం చేశారు.

ఆర్యన్ ఖాన్ శుక్రవారమే జైలు నుండి విడుదల కావాల్సి ఉండగా.. బెయిల్ విడుదలకు సంబంధించిన డాక్యుమెంట్స్ నిర్దిష్ట సమయంలో జైలు అధికారులకు అందకపోవటంతో ఆర్యన్ శుక్రవారం కూడా జైలులోనే ఉండిపోయాడు. ఈ నేపథ్యంలో శనివారం జైలు అధికారులకు కోర్టు బెయిల్ డాక్యుమెంట్స్ అందడంతో ఆర్యన్‌ను విడుదల చేశారు. చాలా రోజుల తరువాత జైలు నుండి విడుదలైన కొడుకుని చూసి షారుక్ ఖాన్ భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు.



Next Story

Most Viewed