రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న షారుఖ్

by  |
sharukh khan
X

దిశ, సినిమా : బిగ్ స్క్రీన్‌పై బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ మ్యాజిక్‌ చూసి మూడేళ్లు అయిపోయింది. ఈ క్రమంలో సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్‌లో గ్రేట్ కమ్ బ్యాక్ ఇస్తున్నాడు షారుఖ్. పఠాన్‌తో రికార్డ్‌లు క్రియేట్ చేసేందుకు పర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో వచ్చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న సినిమాలో దీపికా పదుకొనే, జాబ్ అబ్రహం కీలకపాత్రల్లో కనిపించబోతుండగా.. ప్రస్తుతం దుబాయ్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సందు చేసిన ట్వీట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ‘పఠాన్’ సినిమా కోసం షారుఖ్ ఏకంగా రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడంటూ చేసిన ట్వీట్.. టాక్ ఆఫ్ ది సినీ ఇండస్ట్రీ అయిపోయింది. అఫీషియల్‌గా ఇప్పటి వరకు ఇండియాలో అధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటుడు షారుఖ్ అని.. పఠాన్ కోసం రూ.100 కోట్లు తీసుకుంటున్నాడని పోస్ట్ పెట్టాడు ఉమైర్.



Next Story

Most Viewed