మరోసారి జంటగా కాజల్, షారుఖ్.. ‘డీడీఎల్‌జే’ రీమేక్?

by  |
మరోసారి జంటగా కాజల్, షారుఖ్.. ‘డీడీఎల్‌జే’ రీమేక్?
X

దిశ, సినిమా: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, కాజోల్‌ జంటగా నటించిన క్లాసికల్ హిట్ ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’. ఆదిత్య చోప్రా దర్శకత్వంలో 1995లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. కాగా ఈ క్లాసిక్‌ మూవీకి మళ్లీ దర్శకత్వం వహించనున్నట్లు తెలిపారు ఆదిత్య చోప్రా. కానీ ఇది రీమేక్‌ లేదా సీక్వెల్ అనుకుంటే పొరపాటు. హాలీవుడ్ ప్రేక్షకుల కోసం బ్రాడ్‌ వే(రంగస్థలం కోసం) విభాగంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకులను అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక ఈ షోకు ‘కమ్‌ ఫాల్‌ ఇన్‌ లవ్‌ : ది డీడీఎల్‌జే మ్యూజికల్‌’ అనే టైటిల్‌ ఫిక్స్ చేసినట్లు చెప్పారు. ఓన్ ప్రొడక్షన్ హౌస్ యశ్‌రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌లోనే నిర్మించనున్నట్లు ప్రకటించారు.

‘డీడీఎల్‌జే’ సినిమాను 23 ఏళ్ల వయసులో తెరకెక్కించాను. నిజానికి ఈ సినిమాను మొదట హిందీలో తీయాలనుకోలేదు. రెండు ఇండియన్‌ సినిమాలు కంప్లీట్ చేశాకే టామ్‌క్రూజ్‌తో హాలీవుడ్‌ ప్రాజెక్ట్ చేయాలనుకున్నా. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో 26 ఏళ్ల తర్వాత థియేటర్‌ ఆర్టిస్ట్‌లతో రూపొందిస్తున్నాను. ఇక అమెరికా అబ్బాయి, ఇండియన్ అమ్మాయి మధ్య జరిగే సన్నివేశాలతో తెరకెక్కించే ఈ ప్రాజెక్ట్‌ను 2022లో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.

Next Story

Most Viewed