డే1.. ఫీల్డ్‌లోకి ఎంటర్ అయిన మిథు

by  |
డే1.. ఫీల్డ్‌లోకి ఎంటర్ అయిన మిథు
X

దిశ, సినిమా : మోస్ట్ టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ తాప్సీ.. ఇండియన్ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్‌‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘శభాష్ మిథు’గా తెరకెక్కుతున్న సినిమా కోసం దాదాపు నెలరోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్న భామ.. ట్రైనింగ్ సెషన్స్ నుంచి పిక్స్ కూడా షేర్ చేసింది. ఫైనల్‌గా ట్రైనింగ్ పీరియడ్ పూర్తి చేసుకున్న తాప్సీ.. సోమవారం ‘మిథు’గా సెట్స్‌లోకి అడుగుపెట్టినట్లు వెల్లడించింది. తొలి రోజు సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నట్లుగా తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. వయాకామ్18 స్టూడియోస్ నిర్మిస్తున్న సినిమాకు రాహుల్ ఢోలాకియా దర్శకులు కాగా.. ప్రియా అవెన్ రచయిత. ఇప్పటికే ‘రష్మి రాకెట్’ పేరుతో ఓ స్పోర్ట్స్ డ్రామా చేసిన తాప్సీ.. ఫ్యూచర్‌లో సానియా మీర్జా బయోపిక్ ద్వారా మరో స్పోర్ట్స్ డ్రామా చేయబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని రోనీ స్క్రూవాలా నిర్మించే అవకాశం ఉంది.



Next Story

Most Viewed