మహిళా పోలీస్‌కు తప్పని లైంగిక వేధింపులు..

by  |
మహిళా పోలీస్‌కు తప్పని లైంగిక వేధింపులు..
X

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో కామాంధులు రెచ్చిపోతున్నారు. తనను ప్రేమించడం లేదని ఒకడు.. వేరొకరితో మాట్లాడుతుందని ఇంకొకడు.. చిన్న పిల్లను సైతం లైంగికంగా వేధిస్తూ మరొకడు ఇలా కామాంధులు నిత్యం వేధింపులకు పాల్పడుతూనే ఉన్నారు. కామాంధుల చెర నుంచి రక్షించే మహిళా పోలీసులకు సైతం ఈ వేధింపులు తప్పడం లేదు. తాజాగా నెల్లూరు జిల్లాలో పంచాయతీ కార్యదర్శి కామాంధుడిగా మారాడు. సచివాలయంలో పని చేస్తున్న మహిళా పోలీస్‌ను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు.

అతడి వేధింపులు తట్టుకోలేక బాధితురాలు స్థానిక ఎస్ఐ, సీఐలకు పలుమార్లు ఫిర్యాదు చేసింది. వారు ఆ పంచాయతీ కార్యదర్శిని హెచ్చరించారు. అయినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పురాలేదు. దీంతో దిశ పోలీసులకు ఆ మహిళా పోలీస్ ఫిర్యాదు చేసింది. చిట్టమూరు మండలం గునపాడులో తాను సచివాలయ మహిళా పోలీస్‌గా పనిచేస్తున్నట్లు బాధితురాలు చెప్పింది. కొద్దికాలంగా తనను లొంగదీసుకునేందుకు పంచాయతీ కార్యదర్శి ప్రయత్నం చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని.. ఎస్ఐ, సీఐలు పలుమార్లు హెచ్చరించినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. సదరు పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని బాధిత మహిళా పోలీసు దిశ పోలీసులను వేడుకుంది.



Next Story

Most Viewed