నా ఫ్రెండ్స్ ఇద్దరు ఫోన్ చూస్తూ హస్త ప్రయోగం చేసుకుంటారు.. నన్నూ బలవంతం చేస్తున్నారు!

by Bhoopathi Nagaiah |   (  Updated:2025-02-15 14:32:07  IST  )

నా ఫ్రెండ్స్ ఇద్దరు ఫోన్‌లో అశ్లీల సైట్స్ చూస్తూ రాత్రుళ్లు పరస్పరం హస్త ప్రయోగం చేసుకుంటున్నారు. నన్నూ బలవంతం చేస్తున్నారు.

నా ఫ్రెండ్స్ ఇద్దరు ఫోన్ చూస్తూ హస్త ప్రయోగం చేసుకుంటారు.. నన్నూ బలవంతం చేస్తున్నారు!
X

నేను బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాను. ఫ్రెండ్స్‌తో రూం తీసుకుని ఉంటున్నాను. వాళ్లలో ఇద్దరు ఎంతసేపూ ఫోన్‌లో అశ్లీల సైట్స్ చూడటమే కాకుండా రాత్రుళ్లు పరస్పరం హస్త ప్రయోగం చేసుకుంటున్నారు. నన్నూ బలవంతం చేస్తున్నారు. ఈ విషయంలో నేను చాలా ఇబ్బందికీ, భయానికి లోనవుతున్నాను. మాది మంచి గ్రూప్. కలిపి చదువుకుంటున్నాం. ఈ ఒక్క విషయంలోనే ఇబ్బంది. రూం మారాలంటే ఇది సిటీకి చాలా రిమోట్ ఏరియా. ఏం చెయ్యమంటారు? చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నా. అమ్మానాన్నలు చాలా కష్టపడి చదివిస్తున్నారు. -ఎన్.ఎన్. ఇబ్రహీంపట్నం

నీది చాలా సున్నితమైన సమస్య. దీని నుంచి నువ్వు వెంటనే బయటపడాలి. స్నేహంలో మొహమాటం మంచి విషయాలలోనే ఉండాలి. చెడు విషయాల్లో కాదు. ఆ ఇద్దరు స్నేహితులు హోమోసెక్స్ బారినపడ్డారు. ఇదొక మనో లైంగిక వ్యాధి. దీన్ని మానసిక చికిత్సతో తగ్గించుకోవచ్చు. అలాగే, తీరిక సమయం బాగా ఉండటం, అశ్లీల సైట్స్ ఉన్న నెట్ అందుబాటులో ఉండటం, కోరిక తీర్చుకోవడానికి వేశ్యల వద్దకు వెళితే సుఖవ్యాధులు, ఎయిడ్స్ వస్తాయన్న భయం, ఒకసారి హస్తప్రయోగం అలవాటయ్యాక తగ్గించుకోలేకపోవడం - ఇవన్నీ కూడా మెల్లగా హోమోసెక్స్‌కు దారితీస్తాయి. హాస్టల్స్‌లో, రూమ్‌లలో ఉండే మగ పిల్లలకు ఈ అలవాటు అయ్యే అవకాశం ఎక్కువ. నీ స్నేహితులను సెక్సాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లు. లేదా సైకాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లు ఇది ముదిరిందంటే ఆ సంబంధాల్లోంచి బయట పడలేక పూర్తి "గే"లుగా మారి స్త్రీలను వివాహమాడటానికి, వారితో దాంపత్య జీవితం నెరవడానికి సైతం వారు విముఖత చూపుతారు. ఈ అలవాటు గుంపులో భాగంగా కొనసాగితే ఎయిడ్స్ కూడా వస్తుంది. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. వినకపోతే వెంటనే దూరమైనా సరే, మరో గది మార్చుకో. ఈ విషయం ఒకసారి నీ పేరెంట్స్‌తో కూడా చర్చించినా మంచిదే!

- డాక్టర్ భారతి, MS

మేరిటల్ కౌన్సెలర్

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్


Read More : ఇంకో అమ్మాయితో సెక్స్ చేసి నిరూపించుకో..’ అని అంటుంది నా భార్య

Next Story