ఈ ఇంజెక్షన్ తీసుకుంటే పురుషుల్లో స్పెర్మ్ రిలీజ్ ఆగిపోతుంది.. శృంగార సామర్థ్యం..లైంగిక ఆనందంపై...

by Sujitha Rachapalli |   (  Updated:2025-05-01 07:52:16  IST  )

మీకు తెలుసా..? త్వరలోనే మార్కెట్‌లోకి పురుషుల బర్త్ కంట్రోల్ ఇంజెక్షన్ రాబోతోంది. దీన్ని తీసుకున్నారంటే.. దాదాపు రెండేళ్ల వరకు స్పెర్మ్ రిలీజ్ ఆగిపోతుంది. దీంతో పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. దీన్నే ADAM అని పిలుస్తుండగా.. బయోటెక్ కంపెనీ కంట్రాలైన్ డెవలప్ చేసింది.

ఈ ఇంజెక్షన్ తీసుకుంటే పురుషుల్లో స్పెర్మ్ రిలీజ్ ఆగిపోతుంది.. శృంగార సామర్థ్యం..లైంగిక ఆనందంపై...
X

దిశ, ఫీచర్స్ : మీకు తెలుసా..? త్వరలోనే మార్కెట్‌లోకి పురుషుల బర్త్ కంట్రోల్ ఇంజెక్షన్ రాబోతోంది. దీన్ని తీసుకున్నారంటే.. దాదాపు రెండేళ్ల వరకు స్పెర్మ్ రిలీజ్ ఆగిపోతుంది. దీంతో పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. దీన్నే ADAM అని పిలుస్తుండగా.. బయోటెక్ కంపెనీ కంట్రాలైన్ డెవలప్ చేసింది. ఫేజ్ 1 ట్రయల్స్ ఇప్పటికే బెస్ట్ రిజల్ట్స్ సాధించగా.. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఫేజ్ 2 ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఇంతకీ ఇది ఎలా పని చేస్తుంది? స్పెర్మ్‌ రిలీజ్‌ను ఎలా అడ్డుకుంటుంది? తెలుసుకుందాం.

ADAM అనేది.. వాస్ డిఫెరెన్స్ (వీర్యాన్ని టెస్టిస్ నుంచి యూరెత్రాకు తీసుకెళ్లే గొట్టాలు) లోకి ఇంజెక్ట్ చేసే నీటిలో కరిగే హైడ్రోజెల్. ఈ జెల్ శారీరక అడ్డంకిగా పనిచేస్తుంది. వీర్యకణాలు (స్పెర్మ్) స్ఖలనంలో సీమెన్‌తో కలవకుండా నిరోధిస్తుంది. కానీ స్ఖలనం లేదా లైంగిక ఆనందంపై ప్రభావం చూపదు. ఎందుకంటే స్పెర్మ్ లేని సీమెన్ ఇప్పటికీ ఉత్పత్తి అవుతుంది. ఇది సుమారు రెండు సంవత్సరాలు పనిచేస్తుందంటున్న శాస్త్రవేత్తలు.. ఆ తర్వాత ఈ జెల్ సహజంగా ద్రవీకరణం అవుతుందని, వీర్యకణాల ప్రవాహం పునరుద్ధరించబడుతుందని తెలిపారు. ఒకవేళ రెండేళ్లపాటు వెయిట్ చేయలేకపోతే.. జెల్ తొలగింపు ప్రక్రియ కూడా అందుబాటులో ఉందన్నారు.

మహిళలకు ఉపయోగించే IUD (గర్భాశయ ఉపకరణం) లాంటిదే ఈ ADAM. కాగా అనస్థీషియా ఇచ్చి 10–30 నిమిషాల ఔట్‌పేషెంట్ ప్రాసెస్ ద్వారా వాస్ డిఫెరెన్స్‌లోకి జెల్‌ను ఇంజెక్ట్ చేస్తారు. అది గట్టిపడి సౌకర్యవంతమైన అడ్డంకిని ఏర్పరుస్తుంది. ఈ జెల్ వీర్యకణాలను అడ్డుకుంటుంది. ఫలితంగా స్పెర్మ్ లేని స్ఖలనం జరుగుతుంది. ఫేజ్ 1 ట్రయల్స్‌లో ADAM మంచి రిజల్ట్ సాధించింది. ట్రయల్‌లో పాల్గొన్న ఇద్దరిలో 24 నెలల వరకు స్పెర్మ్ కనిపించలేదు. కాగా ప్రక్రియ తర్వాత 30 రోజుల్లో 99.8% నుంచి 100% స్పెర్మ్ ఫ్లో తగ్గింపు ఉంటుంది. జంతు అధ్యయనాల్లో రెండేళ్ల తర్వాత తిరిగి సాధారణ స్పెర్మ్ సంఖ్య, నాణ్యత చూపబడింది. మానవులలో ఇది ఫేజ్ 2 ట్రయల్స్‌లో పరీక్షించబడుతుంది. దీనిపై కామెంట్ చేస్తున్న జనాలు.. జనన రేటు పడిపోతుంటే ఇలాంటి డెవలప్మెంట్స్ ఎందుకుని ప్రశ్నిస్తున్నారు. కొందరు మాత్రం ప్లాన్ బాగానే ఉందంటున్నారు. నిజానికి ఇలాంటి వాటికోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు. త్వరగా అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.

Next Story