స్ట్రెస్.. ఫాదర్స్ గిఫ్ట్.. స్పెర్మ్ కణాలలో శాశ్వత జీవరసాయన గుర్తులు

by Ramesh Goud |

వర్క్-లైఫ్ బ్యాలెన్స్ చేయలేకపోవడం, సంబంధాలను నిలబెట్టుకునే క్రమంలో పడే బాధ ఒత్తిడి, ఆందోళనకు మూలంగా పరిగణిస్తున్నాం. కానీ ఇది పూర్తిగా నిజం కాకపోవచ్చని చెప్తుంది తాజా అధ్యయనం.

స్ట్రెస్.. ఫాదర్స్ గిఫ్ట్.. స్పెర్మ్ కణాలలో శాశ్వత జీవరసాయన గుర్తులు
X

దిశ, ఫీచర్స్ : వర్క్-లైఫ్ బ్యాలెన్స్ చేయలేకపోవడం, సంబంధాలను నిలబెట్టుకునే క్రమంలో పడే బాధ ఒత్తిడి, ఆందోళనకు మూలంగా పరిగణిస్తున్నాం. కానీ ఇది పూర్తిగా నిజం కాకపోవచ్చని చెప్తుంది తాజా అధ్యయనం. మీ మానసిక అనారోగ్యానికి కారణం ఈ ప్రపంచంలోకి మీరు వచ్చేందుకు కారణమైన జన్యు నిర్మాణమని తెలిపింది. తండ్రి స్ట్రెస్ ఎక్స్‌పీరియన్స్ తన స్పెర్మ్ కణాలలో శాశ్వత జీవరసాయన గుర్తులను వదిలేస్తుందని.. పుట్టబోయే పిల్లల అభివృద్ధిని ప్రభావితం చేస్తుందని వివరించింది.

స్పెర్మ్ అనాలసిస్..

30ల చివరి నుంచి 40ల ప్రారంభ వయసులో ఉన్న 58 మంది పురుషుల స్పెర్మ్ నమూనాలను విశ్లేషించిన పరిశోధకులు.. తక్కువ ఒత్తిడి స్థాయిలు ఉన్న వారితో పోలిస్తే అధిక బాల్య ఒత్తిడి స్థాయిలను నివేదించిన వారిలో ప్రత్యేకమైన ఎపిజెనెటిక్ మార్కర్స్ కనుగొన్నారు. జన్యు నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్న, మెదడు అభివృద్ధికి సంబంధించిన స్మాల్ నాన్‌కోడింగ్ RNA అణువులలో మార్పులను గుర్తించారు. ప్రారంభ నాడీ పెరుగుదలలో పాల్గొన్న జన్యువుల దగ్గర DNA మిథైలేషన్ నమూనాలలో తేడాలున్నాయని తెలిపారు. ధూమపానం, మద్యపానం వంటి జీవనశైలి కారకాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కూడా ఈ పరమాణు ముద్రలు (molecular imprints)అలాగే ఉన్నాయని.. చైల్డ్‌హుడ్ ఎక్స్‌పీరియన్స్ స్పెర్మ్‌లో శాశ్వత బయోలాజికల్ లెగసీని వదిలివేస్తాయని తెలిపారు.

జన్యు వ్యక్తీకరణ..

జన్యు వారసత్వం స్థిరంగా,మారనిదిగా ఉండటం అనే సాంప్రదాయ అవగాహనను ఈ పరిశోధనలు సవాలు చేస్తుంది. జన్యువులను ఎపిజెనెటిక్స్ ద్వారా సవరించవచ్చని చూపిస్తుంది. ఆహారం, గాయం, ఒత్తిడి వంటి పర్యావరణ కారకాలు DNA క్రమాన్ని మార్చకుండా జన్యు పనితీరును మార్చగలవు. ఈ మార్పులు పరమాణు స్విచ్‌లుగా పనిచేస్తాయి. మెదడు అభివృద్ధి నుంచి వ్యాధి గ్రహణశీలత వరకు వివిధ జీవ ప్రక్రియలను ప్రభావితం చేస్తాయి. సానుకూల అనుభవాలు బాహ్యజన్యు నమూనాలను కూడా ప్రభావితం చేస్తాయని పరిశోధన సూచిస్తుంది. మైండ్‌ఫుల్‌నెస్, థెరపీ, బలమైన సామాజిక సంబంధాలు, వ్యాయామం, పోషకాహారం వంటి జీవనశైలి మార్పులు జన్యు వ్యక్తీకరణను ప్రభావితం చేస్తాయి.

నిశ్శబ్ద ఒత్తిడి ..

గాయం నుంచిబయటపడిన వారిపై అధ్యయనాలు మెడికల్ ప్రొసీజర్స్..ఒత్తిడి వల్ల కలిగే కొన్ని ప్రతికూల బాహ్యజన్యు మార్పులను తిప్పికొట్టగలవని సూచిస్తున్నాయి.శరీరం నిరంతరం అనుభవాలకు ప్రతిస్పందన అనుగుణంగా పరిణామం చెందుతుంది. దీని ప్రభావం వ్యక్తిగత శ్రేయస్సుకు మించి తరాల ప్రభావం వరకు విస్తరించి ఉంటుంది. పురుషులు, ముఖ్యంగా తండ్రులు తరచుగా ఒత్తిడిని నిశ్శబ్దంగా భరిస్తారు. కానీ మానసిక ఆరోగ్య సంరక్షణ భవిష్యత్ తరాలను ప్రభావితం చేస్తుందని పరిశోధన నొక్కి చెబుతుంది.

Next Story