- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారతీయుల పురుషాంగం సైజుపై లేటెస్ట్‌గా సర్వే.. కాకరేపుతున్న కొలతలు
సాధారణంగా చాలా మందికి పురుషాంగం పొడవుపై చాలా అపోహలు ఉంటాయి. దీని కారణంగా కొందరు అవమానాలు ఎదుర్కొన్న సందర్భాలు కూడా చూస్తాం. ‘ఓ మై గాడ్ 2’ మూవీ దీన్ని బేస్ చేసుకునే ఉండగా.. సైజ్ మ్యాటర్స్ అనేది నిజంగా నిజమా అనే దానిపై ఈ చిత్రం డిస్కస్ చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా చాలా మందికి పురుషాంగం పొడవుపై చాలా అపోహలు ఉంటాయి. దీని కారణంగా కొందరు అవమానాలు ఎదుర్కొన్న సందర్భాలు కూడా చూస్తాం. ‘ఓ మై గాడ్ 2’ మూవీ దీన్ని బేస్ చేసుకునే ఉండగా.. సైజ్ మ్యాటర్స్ అనేది నిజంగా నిజమా అనే దానిపై ఈ చిత్రం డిస్కస్ చేసింది. దీనివల్ల రోడ్లపై ఉన్న మూలికలు వాడి శారీరకంగా, మానసికంగా నష్టపోతున్నారన్న విషయం తెలిసిందే. కాగా సెక్స్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్‌ను ఈ విషయం హైలెట్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ అపోహలు, అనుమానాలను తీర్చేందుకు కేరళలో ఓ అధ్యయనం నిర్వహించారు. ఆరోగ్యకరమైన భారతీయుల పురుషాంగం పొడవు గురించి వివరించారు.
500 మందిపై చేసిన సర్వేలో సాధారణ స్థితిలో పెనిస్ పొడవు ఐదు నుంచి పదమూడు సెంటీ మీటర్లు ఉంటుందని.. సగటున ఎనిమిది సెంటీ మీటర్లు అని తెలిపింది అధ్యయనం. అదే గట్టిపడినప్పుడు పది నుంచి పది హేడు సెంటీ మీటర్లు ఉంటుందని.. ఇది సగటున పద మూడు సెంటీ మీటర్లు అని స్పష్టం చేసింది. అమెరికా లాంటి దేశాలతో పోలీస్తే కేవలం ఒకటి, రెండు సెంటీ మీటర్ల తేడా మాత్రమే ఉందని క్లారిటీ ఇచ్చింది. ఇక మరో అధ్యయనం గతంలో సెక్స్ డ్యురేషన్ గురించి వివరించింది. ఐదు నుంచి ఆరు నిమిషాలు శృంగార సమయం సగటుగా నిర్ణయించబడగా.. ఏడు నుంచి పది నిమిషాలు ఉంటే ఇద్దరు పార్ట్‌నర్స్ శాటిస్‌ఫై అవుతారని తెలిపింది.
వాస్తవానికి స్త్రీ యోని భాగంలోని క్లిటోరిస్ 4 అంగులాల పురుషాంగంతోని తృప్తిపడుతుంది. అంతుకు మించి పొడవు కూడా అవసరం లేదని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. యోని లోతు 4 అంగులాలు ఉంటుందని, వెడల్పు 4 నుంచి 6 అంగులాలకు పెరుగుతుందని నివేదికలు తెలుపుతున్నాయి. యోని సైజులకు అనుగుణంగా పురుషాంగం సైజు కూడా ఉద్రేకం కలిగిన సమయంలో పెరుగుతుందని సెక్సాలజిస్టులు పేర్కొంటున్నారు.






