మా ఆయనకు క్షణాల్లో స్ఖలనం అవుతుంది.. రెండేళ్లుగా ఇబ్బంది పడుతున్నా...

by Sujitha Rachapalli |

రెండేళ్లుగా శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడుతున్న భర్త.. ఈ కారణంగా భార్యను వేధిస్తూ.. అనుమానిస్తున్న భర్త.. కానీ ఈ సమస్యకు కారణం ఏంటి? పరిష్కారం ఏంటి?

మా ఆయనకు క్షణాల్లో స్ఖలనం అవుతుంది.. రెండేళ్లుగా ఇబ్బంది పడుతున్నా...
X

మేడమ్! నాకు వివాహమై 19 సంవత్సరాలవుతోంది. నా వయస్సు 35. మా వారికి నేనంటే చాలా ప్రేమ. ఆయనకు శ్రీఘ్రస్ఖలన సమస్య మొదట్నించీ ఉంది. మొదట్లో పర్వాలేదనిపించినా మెల్లగా అది ఎక్కువైంది. క్షణాల్లో స్ఖలనం అవుతోంది. సమస్య సెక్స్ కాదు. నాకు ఆయనే ముఖ్యం. కానీ ఆయన రెండేళ్లుగా నాతో సరిగ్గా ఉండటం లేదు. అనుమానిస్తున్నారు. నాతో మాట్లాడరు. ఉద్యోగం సరిగా చేయరు. డాక్టర్‌ను కలుద్దామంటే రారు. డాక్టరు వద్దకు వెళ్ళి చికిత్స తీసుకోవడం నా ఆనందం కోసం కాదు. ఆయన బాధ తగ్గడం కోసం. కానీ ఎంత చెప్పినా వినడం లేదు. ఏం చేయమంటారో చెప్పండి.

నిజంగా ఈ సమస్య వల్ల మీరిద్దరూ బాధపడుతున్నారు. భర్తకి సెక్స్ సమస్య ఉంటే భార్య అర్థం చేసుకోదని భర్తలు ఎందుకు అనుకుంటారు? ఇద్దరికీ సమస్య కదా. శీఘ్రస్థలన సమస్య జలుబు లాంటిది. ప్రపంచంలో కోటానుకోట్ల మంది పురుషులకి ఉంది. ఇది తగ్గని సమస్య ఏ మాత్రమూ కాదు. శీఘ్రంగా అంటే త్వరగా అయ్యే స్థలనాన్ని ఆపి, అవగస్తంభన కాలాన్ని పెంచే సెక్స్ థెరపీలో కొన్ని అద్భుతమైన టెక్నిక్స్ సాధన చేస్తే సమస్య పరిష్కారమవుతుంది. కొన్ని భర్త విడిగా, కొన్ని భార్య సహకారంతో చేయాలి. ఫర్ఫార్మెన్స్ యాంగ్జయిటీ వల్ల శీఘ్రస్థలనం వస్తుంది. శీఘ్రస్థలనం తగ్గకపోతే ఫర్ఫార్మెన్స్ యాంగ్జయిటీ ఇంకా ఎక్కువవుతుంది. దీనికి సైకోథెరపీ ఉంది. శీఘ్రస్థలన సమస్యకు మానసిక కారణాలలో విపరీతమైన ఆందోళన, భయం, అజ్ఞానం, భాగస్వామి తిరస్కారం వంటివి ఉన్నాయి. ఇక శారీరక కారణాల్లో సెక్స్ కండరాలు బలహీనంగా ఉండటం, తరచూ వచ్చే మూత్రనాళపు ఇన్ఫెక్షన్స్, ప్రోస్టేట్ గ్లాండ్ ఇన్ఫెక్షన్స్, డయాబెటిస్, బీపీ వంటివి ఉన్నాయి. ఏదేమైనా మిమ్మల్ని ఆనందపరచలేకపోతున్నానన్న బాధలోంచి వచ్చిన కోపం, చిరాకు, ఆత్మన్యూనత, మిమ్మల్ని అనుమానించే స్థాయికి తీసుకెళ్లాయి. సెక్స్ కంటే తన ప్రేమే ముఖ్యమని భరోసా ఇవ్వండి. శీఘ్రస్ఖలనం అవమానకరమైన, సిగ్గుతో భయపడే అంశం కాదు. మీ వారిని సెక్సాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లండి. ఇద్దరికీ కౌన్సెలింగ్, సెక్స్ సైకోథెరపీ చాలా అవసరం. రెండు రోజుల చికిత్సతో తగ్గిపోయే దానికి జీవితాన్ని నరకంలా మార్చుకోకండి.

Next Story