- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
New Plastic : ఈ ప్లాస్టిక్‌తో నో రిస్క్.. పైగా పర్యావరణానికి మేలు కూడా(Full Details)
ప్లాస్టిక్ సమస్య ప్రపంచాన్ని వేధిస్తోంది. పర్యావరణాన్ని కాలుష్యం చేస్తుంది. సముద్రాల్లోకి చేరి జీవజాలంపై ఎఫెక్ట్ చూపుతుంది. మిలియన్ ఏళ్లు భూమిలో కలిసిపోకుండా ఉంటూ మైక్రోప్లాస్టిక్‌గా మారి మనుషులు

దిశ, ఫీచర్స్ : ప్లాస్టిక్ సమస్య ప్రపంచాన్ని వేధిస్తోంది. పర్యావరణాన్ని కాలుష్యం చేస్తుంది. సముద్రాల్లోకి చేరి జీవజాలంపై ఎఫెక్ట్ చూపుతుంది. మిలియన్ ఏళ్లు భూమిలో కలిసిపోకుండా ఉంటూ మైక్రోప్లాస్టిక్‌గా మారి మనుషులు, జంతువుల్లోకి చేరి అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. ఇప్పటి వరకు పరిష్కారం లేని సమస్యగా మారింది. అయితే జపాన్ శాస్త్రవేత్తలు సరికొత్త ప్లాస్టిక్ కనిపెట్టారు. ఇది ప్రస్తుతమున్న ప్లాస్టిక్‌లా పని చేసిన ఉప్పు నీటిలో పూర్తిగా కలిసిపోతుంది. విషపూరిత రసాయనాలు మిగల్చకుండానే మింగిల్ అయిపోతుంది.
ఫుడ్ అడిటివ్, ఫెర్టిలైజర్ కాంపౌండ్ మిశ్రమంతో తయారైన ఈ ప్లాస్టిక్.. నీటిలో మిక్స్ చేయగానే ప్లాస్టిల్ మెటీరియల్‌ను ఫామ్ చేస్తుంది. అంతే స్ట్రాంగ్‌గా వర్క్ చేస్తుంది. దాన్ని సాల్ట్ వాటర్‌తో కలిపినప్పుడు.. ప్లాస్టిక్‌ను బంధించిన బాండ్స్ బ్రేక్ అయిపోతాయి. 8.5 గంటల్లో కంప్లీట్‌గా ఉప్పు నీటిలో కరిగిపోయి.. మొక్కలు, సముద్రజీవులకు హెల్ప్ అయ్యే పోషకాలను మిగులుస్తాయి. ఇవి మొక్కలకు, జంతుజాలానికి సేఫ్ కూడా. ఇప్పుడున్న ప్లాస్టిక్ మాదిరిగా పర్యావరణానికి హాని చేయకుండా సురక్షితంగా ఉంచుతాయి.






