- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pregnancy Tips : మెట్లు ఎక్కి.. దిగితే ప్రెగ్నెన్సీ నిలువదా.. ?
తల్లి ఆరోగ్యంగా ఉండడానికి కాన్పుకి ముందు, తర్వాత వ్యాయామం చాలా అవసరం. అయితే.. గర్భసంచి వదులుగా ఉండి బ్లీడింగ్ నొప్పి ఉంటే ఈ వాకింగ్, యోగా ఎక్సర్సైజులు చేయకూడదు.

ప్రశ్న: మేడం.. మేము ఐదు నెలల నుంచి థర్డ్ ఫ్లోర్లో ఉంటున్నాం. మా ఫ్లోర్ కి చేరాలంటే 45 మెట్లు ఉన్నాయి. మాకు ఇంకా పిల్లలు పుట్టలేదు. మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉంటే పిల్లలుకారని విన్నాను. ఇది నిజమేనా ? - వందన, నిజామాబాద్
జవాబు : మెట్లు ఎక్కి దిగితే ప్రెగ్నెన్సీ రాదన్నదనేది అజ్ఞానం మాత్రమే. నిజానికి ఈ ఎక్కడం దిగడం అనేది మంచి వ్యాయామం లాంటిది. దీనివల్ల పొత్తికడుపు కండరాలు కటివలయము గర్భాశయ కండరాలు బలోపేతం అవుతాయి బిడ్డ ఆరోగ్యంగా పుట్టడమే కాదు.. నార్మల్ డెలివరీ అవుతుంది. తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. గర్భధారణ సమయంలో కూడా వ్యాయామాలు, వాకింగ్ చేయొచ్చు. గర్భం వచ్చిన తర్వాత గర్భసంచి వదులుగా ఉండి బ్లీడింగ్ నొప్పి ఉంటే ఈ వాకింగ్, యోగా ఎక్సర్సైజులు చేయకూడదు. ఆరోగ్యవంతమైన గర్భధారణకి, పిండం ఆరోగ్యంగా ఎదగడానికి, సుఖ ప్రసవానికి, తల్లి ఆరోగ్యంగా ఉండడానికి కాన్పుకి ముందు, తర్వాత వ్యాయామం చాలా అవసరం. మీకు పెళ్లి అయి సంవత్సరం దాటి, ఏ రకమైన కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించకుండా భార్యాభర్తలిద్దరూ కలుస్తున్నా.. సంతానం కలగకపోతే ఇద్దరూ కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. అంతేగాని మెట్లు ఎక్కడం వల్ల గర్భం రావడం లేదన్నది మంచి కారణం కాదు. ఇద్దరూ మంచి గైనకాలజిస్ట్ ని కలవండి.
ప్రశ్న: మేడం.. నా వయసు 22 సంవత్సరాలు. నా అంగం చాలా చిన్నదిగా ఉంది. ఆరు సంవత్సరాలుగా నాకు హస్తప్రయోగం అలవాటు ఉంది. అందుకే సైజు చిన్నగా అయిపోయిందా ? ఈ మధ్యనే నేను పోలీస్ జాబ్ కి ప్రయత్నిస్తున్నాను. అంగం చిన్నదిగా ఉండటం వల్ల మెడికల్ టెస్ట్ లో సెలెక్ట్ అవుతానో ? లేదో ? అని దిగులుగా ఉంది. - పీకేఆర్, కర్నూలు
జవాబు : నువ్వు అనవసరంగా ఆందోళన చెందుతున్నావు. అంగం గట్టిపడక ముందు ఏడు నుంచి పది సెంటీమీటర్లు, గట్టి పడ్డాక 12 నుంచి 16 సెంటీమీటర్లు ఉంటుంది. గట్టిపడిన తర్వాతే భార్యతో సెక్స్ చేస్తారు. గట్టిపడక ముందు అంగం సైజ్ సెక్స్ కి పనికిరాదు. ఈ విషయం చాలామందికి తెలియక ఆందోళన చెందుతూ ఉంటారు. నువ్వు చెప్పిన దాని ప్రకారం నీకు అంగం పరిమాణము బాగానే ఉంది. ఏ మాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పోలీస్ జాబ్ కోసం మెడికల్ టెస్ట్ లో తప్పక పాస్ అవుతావు. అనవసరంగా ఆందోళన పడకుండా పోలీసు టెస్టును ఆత్మవిశ్వాసంతో అధిగమించు.
- డాక్టర్ భారతి
సెక్సువల్ హెల్త్ &ఫ్యామిలీ కౌన్సెలర్
ప్రీ & పోస్ట్ మేరేజ్ &
సెక్సువల్ కౌన్సెలింగ్
86885 19225






