- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఇంకో అమ్మాయితో సెక్స్ చేసి నిరూపించుకో..’ అని అంటుంది నా భార్య
నా భార్య నేను సెక్స్‌కు పనికిరానంటూ పుట్టింటికి వెళ్లిపోయింది. కానీ నాకు అంగస్తంభన బాగానే ఉంది.

మేడమ్! నా వయస్సు 26 సంవత్సరాలు. పెళ్లై సంవత్సరం అయింది. కానీ, భార్యకి దూరంగా ఉంటున్నాను. నా భార్య నేను సెక్స్‌కు పనికిరానంటూ పుట్టింటికి వెళ్లిపోయింది. వాళ్లు పూర్తిగా పల్లెటూరి వాళ్లు. నాకు అంగస్తంభన బాగానే ఉంది. కానీ క్షణాల్లో అది అంగప్రవేశం కాకముందే వీర్యస్ఖలనం అయిపోతుంది. నా భార్య పుట్టింటి వాళ్లందరికీ 'నేను సెక్స్‌కు పనికి రానని'చెప్పేసింది. వాళ్ల ఊర్లో పంచాయితీ పెట్టి 'ఇంకో అమ్మాయితో సెక్స్ చేసి' నిరూపించమంటున్నారు. అమ్మానాన్నలకు, నాకు ఇది అస్సలు ఇష్టం లేదు. ఈ పద్ధతిలో కాకపోతే విడాకులుంటున్నారు. నన్నేం చేయమంటారు. జీవితం మీద విరక్తిగా ఉంది. - ఎస్.ఎస్.నల్గొండ
చాలామంది శీఘ్రస్ఖలన సమస్యను అంగస్తంభన సమస్యగా చూస్తారు. ఉద్రేకం-భయం-ఆందోళనలతో కూడిన మానసిక స్థితి. వీర్యాన్ని స్ఖలించే సెక్స్ కండరాల మీద నియంత్రణ లేకపోవడం రెండూ కలిసి శీఘ్రస్ఖలనానికి దారితీస్తుంది. సెక్స్ సమయంలోని ఆందోళనను తగ్గించి, స్ఖలనాన్ని నియంత్రించే సెక్స్ కండరాల మీద పటుత్వాన్ని పెంచి, అంగస్తంభన కాలాన్ని పెంచే ఎక్సర్‌సైజులు సెక్స్ థెరపీలోఉన్నాయి. మీకు అంగస్తంభన సమస్య లేదు. మీ అంగస్తంభన సామర్థ్యాన్ని తెలిపే వైద్య పరీక్షలున్నాయి. సెక్స్ హార్మోన్ల స్థాయి అంగంలో రక్త సరఫరాని తెలిపే పెనైల్ ఆస్క్రోటల్ కలర్ డాప్లర్ చేయించుకొని అవి సాక్ష్యంగా చూపిస్తే చాలు. అంతేకానీ, నాలుగు గోడల మధ్య భార్యతో మాత్రమే చేసే శృంగారం బహిరంగంగా మరో స్త్రీతో చేయమనడం దుర్మార్గం, అనైతికం, అనాగరికం! దీనికి మీరు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ సమయంలో అందరూ చూస్తుండగా భయం, ఆందోళనతో అస్సలు అంగస్తంభనే కలగదు. మీరు, మీ అత్తమామ, భార్యలతో సెక్సాలజిస్ట్‌ని కలిస్తే పై పరీక్షలు చేయించి, అందరికీ కౌన్సెలింగ్ ఇచ్చి సమస్యను పరిష్కరిస్తారు.
- డాక్టర్ భారతి, MS
మేరిటల్ కౌన్సెలర్
సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్






