- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిల్లలు వద్దు.. i-Pill వాడకం సేఫేనా?
అధిక రక్తపోటు, బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ వ్యాధులు, కామెర్లు ఉన్నవాళ్లు, అండవాహికలలో ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్లు, ఐపిల్ వాడితే ప్రమాదం

ప్రశ్న: మేడం.. మరో వారం రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాను. నాకు పీజీ పూర్తి చేయాలని ఉంది. అందుకోసం పిల్లల్ని కనడం ఇప్పుడే ఇష్టం లేదు. గర్భ నిరోధానికి ఐ-పిల్ సురక్షితమేనా ? - మహేశ్వరీ, నర్సంపేట.
జవాబు : ఈ మధ్య ఐ-పిల్(i-Pill ) వాడకం చాలా ఎక్కువ అయింది. దీనిలో లివో నార్జెస్ట్రాల్ 15 ఎం.జి హార్మోన్ ఉంటుంది. అత్యవసర లేదా అనివార్య పరిస్థితుల్లో మాత్రమే వాడదగ్గ గర్భ నిరోధక మాత్ర ఇది. గర్భనిరోధక జాగ్రత్తలు పాటించకుండా శృంగారంలో పాల్గొన్నప్పుడు వచ్చే ప్రెగ్నెన్సీని అడ్డుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. మీరు ఇతర కాంట్రాసెక్టివ్ పిల్స్ వాడొచ్చు. మీ భర్త నిరోధ్ వాడొచ్చు. సేఫ్టీ పీరియడ్‌లో కలవచ్చు. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వీటిని మీరు ఎందుకు వాడుకోకూడదు. ఐపిల్ ఏమంత సురక్షితం కాదు.
ఎప్పుడు వాడాలి ?
కండోమ్ చిరిగిపోయినప్పుడు, డైలీ వాడే గర్భనిరోధక మాత్రలు రెండు మూడు రోజులు వేసుకోవడం మర్చిపోయినప్పుడు, అసురక్షిత శృంగారంలో పాల్గొన్నప్పుడు, అత్యాచారానికి గురైనప్పుడు గర్భం రాకుండా నివారించేందుకు మాత్రమే ఐపిల్‌ని వాడాలి. అయితే ఇది కలయిక జరిగిన 72 గంటలలోపు అంటే మూడు రోజులలోపే వేసుకోవాలి తర్వాత వేసుకున్నా ఉపయోగం ఉండదు. ఇక రక్తం గడ్డకట్టే చరిత్ర ఉన్నవాళ్లు, కరోనరీ డిజార్డర్, గుండె జబ్బులు అడ్వాన్స్‌డ్ డయాబెటిస్ వంటివి ఉన్నవాళ్లు, అలాగే మైగ్రేన్ వ్యాధి, అధిక రక్తపోటు, బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ వ్యాధులు, కామెర్లు ఉన్నవాళ్లు, అండవాహికలలో ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్లు, ఐపిల్ వాడితే ప్రమాదం. కాబట్టి మీరు ఇంత రిస్క్ తీసుకోకుండా చక్కగా గైనకాలజిస్ట్ దగ్గరకు వెళ్లి మీకు సరైన ఫ్యామిలీ ప్లానింగ్ పద్ధతులు గైడ్ చేయమని అడగండి. సొంతంగా ఐపిల్ వాడకండి
దుష్ప్రభావాలు
ఐ-పిల్ వాడకుండా ఉంటేనే మంచిది. ఇది వేసుకోవడం వల్ల కొన్నిసార్లు వాంతులు, వికారం, తలనొప్పి పొత్తికడుపులో నొప్పి, వక్షోజాల్లో నొప్పి, ఆకలి మందగించడం వంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. పీరియడ్స్ సమయం కంటే ముందుగానే యోని నుంచి రక్తస్రావం జరగడం, నెలసరి క్రమం తప్పడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా దురద, మంట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతి బిగుసుకుపోవడం, నోరు, గొంతు, నాలిక, పెదవులలో వాపు రావడం, శబ్దం మారడం వంటి తీవ్రమైన ఇబ్బందులు కూడా కొందరికి రావచ్చు. మూత్రం గాఢమైన రంగులోకి మారడం, మూత్ర విసర్జనలో మార్పులు రావచ్చు. దగ్గినప్పుడు రక్తం పడటం, శరీరం ఒక వైపు తిమ్మిరెక్కడం బలహీనంగా అనిపించడం వంటివి కూడా జరుగుతాయి. ఇవన్నీ గమనిస్తే వెంటనే గైనకాలజిస్టులను సంప్రదించాలి.
డాక్టర్ భారతి
సెక్సువల్ హెల్త్ &ఫ్యామిలీ కౌన్సెలర్
ప్రీ & పోస్ట్ మేరేజ్ &
సెక్సువల్ కౌన్సెలింగ్
86885 19225






