- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, ఫీచర్స్: మేడం.. నేనొక అమ్మాయిని ప్రేమించాను. నా పేరెంట్స్ ఒప్పుకున్నారు. వాళ్ల పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు. మేమిద్దరం కూడా మేజర్లమే. ఈ మధ్య నాకు ఒక ఆలోచన వస్తోంది. ఆమెతో సెక్స్ లో పాల్గొని కమిట్ అయిపోతే వాళ్ల పేరెంట్స్ ఒప్పుకుంటారేమో ? అని అనిపిస్తోంది. అలా చేయమంటారా ? ఇది మంచి ఆలోచనేనా ? ఆమె లేకుండా నేను బతకలేను ఏం చేయమంటారు ?
- రాజు, వరంగల్
జవాబు : నీ ప్రేమ నిజమైన ప్రేమే ఒప్పుకుంటాను. ఆమె లేకుండా బతకలేని స్థితికి చేరుకున్న నీ ప్రేమ.. మరీ ఇంత చెత్త ప్రమాదకరమైన ఆలోచనలను ఎందుకు చేస్తోంది ? ఆమెకు ప్రమాదం కదా నువ్వు ఇలా చేస్తే ? పెద్దలు ఒప్పుకోకపోతే మీ పేరెంట్స్ తో కలిసి ఒప్పించే ప్రయత్నం చేయు. అసలు ఒప్పుకోకపోతే ఇద్దరూ మేజర్లే. పెళ్లి చేసుకునే వయసు కూడా వచ్చింది. ఇద్దరూ ఉద్యోగస్తులై ఉన్నారు. కాబట్టి రిజిస్టర్ మ్యారేజి చేసుకోండి. అది కూడా అమ్మాయి పేరెంట్స్ కి చెప్పి మాత్రమే. అంతేకానీ అమ్మాయితో సెక్స్ లో పాల్గొంటే ఒప్పేసుకుంటారు అన్న చెత్త ఆలోచన పక్కకు పెట్టు. అలా చేస్తే ఒప్పేసుకుంటారు అన్నది నీ భ్రమ. ఆ పని చేశాక అస్సలు ఒప్పుకోరు అనుకుందాం. అమ్మాయికి గర్భం వస్తే ఆ పేరెంట్స్ ప్రతిస్పందన చర్యలు అమ్మాయితో ఎలా ఉంటాయో నువ్వు ఊహించగలవా? అమ్మాయి ఎంత ఇబ్బందిలో, ప్రమాదంలో పడిపోతుందో, ఎన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందో నీ ఊహకు అందగలదా? కాబట్టి ఎదురు చూడండి. ఒప్పించే ప్రయత్నం చేయండి. కొద్ది కాలం ఆగైనా సరే ఒప్పుకునే పరిస్థితి లేకపోతే అందర్నీ ఆహ్వానించి ఆదర్శ వివాహం చేసుకోండి.అంతేగానీ తప్పుడు పనులు మాత్రం చేయొద్దు. కనీసం అలాంటి ఆలోచన కూడా మంచిది కాదు.
- డాక్టర్ భారతి
సెక్సువల్ హెల్త్ &ఫ్యామిలీ కౌన్సెలర్
ప్రీ & పోస్ట్ మేరేజ్ &
సెక్సువల్ కౌన్సెలింగ్
86885 19225






