నాకు సెక్స్ అంటే ప్రాణం.. కనీసం 26 నిముషాలైనా ఉండాలి.. కానీ మా ఆవిడ 2 లేక 3 నిముషాలకే..

by Bhoopathi Nagaiah |   (  Updated:2025-04-16 14:36:46  IST  )

మేడమ్! నా వయస్సు 40 సంవత్సరాలు. నాకు సెక్సంటే చాలా ఇష్టం. నా భార్య వయస్సు 37 సంవత్సరాలు.

నాకు సెక్స్ అంటే ప్రాణం.. కనీసం 26 నిముషాలైనా ఉండాలి.. కానీ మా ఆవిడ 2 లేక 3 నిముషాలకే..
X

ఎన్నో భంగిమలతో చేయాలని మనసు ఆరాటపడుతుంది..

మేడమ్! నా వయస్సు 40 సంవత్సరాలు. నాకు సెక్సంటే చాలా ఇష్టం. నా భార్య వయస్సు 37 సంవత్సరాలు. ఒకటి లేక రెండు నిముషాలలో సెక్సు ముగుస్తుంది. నాకు స్థలనం కావడానికి కనీసం 26 నిముషాలు పడుతున్నది. ఎన్నో భంగిమలతో చేయాలని మనసు ఆరాటపడుతుంది. ఎంత నచ్చ చెప్పినా వినదు. రోజూ ఒకసారైనా సెక్సులో పాల్గొనాలనిపిస్తుంది. నా భార్య సహకరించదు. వారానికి ఒకసారి మాత్రమే నాతో సెక్స్‌లో పాల్గొంటుంది. అది కూడా 2 లేక 3 నిముషాలు మాత్రమే. కానీ, నాకు మాత్రం 20 నిముషాలైనా దాటాలి. నాకు ఏ దురలవాట్లు, బి.పి., షుగర్ లాంటివి లేవు. కాకపోతే, నేనే ఇంకో తోడు చూసుకోవాలనుకుంటున్నాను. నా సమస్యకు మీరే పరిష్కారం తెలుపగలరు. - ఎమ్.ఆర్., మహబూబ్ నగర్

నీ భార్యకు శృంగారంలో పాల్గొనడం అంటే ఎందుకు ఇష్టం లేదో కనుక్కోవాలి. బహుశ నువ్వు శృంగారాన్ని ఒక ఎక్స్పరిమెంటల్(Experimental) ప్రక్రియగా భావించడమే కారణం కావచ్చు. నీ విపరీతమైన లైంగికవాంఛలకు, సెక్స్‌ను నీ భార్య దేహాన్ని ఒక ప్రయోగాత్మక విషయంగా, లైంగిక వస్తువుగా కోరుకుంటున్నావు. కాబట్టే, ఆమె నీతో శృంగారాన్ని ఒప్పుకోవడం లేదు. నీకు నచ్చే అన్ని శృంగార భంగిమలు ఆమెకు నచ్చాలిగా? ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా చేస్తూ ఆమె లోపంగా ఎందుకు భావిస్తావు? నీలో లోపంగా ఎందుకు స్వీకరించవు? ఆమెకిష్టమైన రీతిలో శృంగారంలో పాల్గొంటే ఆమెకు కూడా అంగీకారంగా ఉండి నీకు సహకరిస్తుందిగా? ఆమెని ఈ విషయంలో బలవంతం చేస్తూ ఒత్తిడికి గురిచేయడం నేరం, అమానవీయం. ఆమెకిష్టమైన రీతిలోనే శృంగారంలో పాల్గొనే హక్కుని నువ్వు గౌరవించనంత కాలం ఆమె నీతో సహకరించదు.

ముందు నువ్వు ఈ విషయంలో ఆత్మ విమర్శ చేసుకోవాలి. పైగా భార్య కాకుండా ఇంకో తోడు కోసం ఉవ్విళ్ళూరుతున్నావు. సిగ్గు లేదా నీకు? ఒకపక్క లైంగికంగా హింసిస్తావు. దానికి నీ భార్య తన ఇష్టాన్ని, ఆత్మగౌరవాన్ని చంపుకుని లొంగి పోవాలి. సహకరించక పోతే ఇంకొక స్త్రీని ఆ లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి తెచ్చుకోవాలని అనుకుంటావు. బహుశ నీ భార్యకు చెప్పుతూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుండుంటావు. ఆమెను అభధ్రతలోకి తోసి నీ లైంగిక వాంఛలను తీర్చుకోబోతావు. మొత్తానికి నీ భార్యను నరకానికి గురిచేస్తున్నావు.

మీ మతంలో అనేక నిబంధనలున్నాయి. ఉంది కదా అని నువ్వు ఆలోచించే ముందు నైతికంగా అది ఎంత అనాగరికమో, అమానవీయమో ఆలోచించు. భార్య కూడా భర్త వేధింపుల నుంచి విముక్తి కావడానికి ఓ పద్దతి ఉంది. దీన్ని ఉపయోగించుకోకుండా భార్యలు, భర్తలు వాడే విడాకులు అనే పదానికి భయపడ్తుంటారు. నువ్వు నీ లైంగిక ఉక్రోషాన్ని తగ్గించుకోకుండా ఇంకో స్త్రీయే పరిష్కారమంటే ఆ స్త్రీ కూడా వెళ్ళిపోతుంది. అందుకే, ముందు నువ్వు మంచి సెక్సాలజిస్ట్‌ను కలిసి నీ ఈ అసహజ లైంగిక ప్రక్రియల అలవాటు నుంచి బయట పడడానికి కౌన్సెలింగ్, చికిత్స తీసుకో.

- డాక్టర్ భారతి, MS

మేరిటల్ కౌన్సెలర్

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్

Also Read..

వేశ్యలను పెళ్లి చేసుకుంటే జైలు నుంచి విడుదల.. ఖైదీలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రభుత్వం

Next Story