- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పని మనిషితో భర్త సరసాలు.. బెడ్‌పై వీర్యం చూసిన భార్య.. తర్వాత
భర్తపై అనుమానంతో చనిపోదామనుకున్న భార్య.. కానీ పిల్లల కోసమే తను జీవించాలనుకుంది.. కానీ ఆయనతో శారీరకంగా ఎలా కలుస్తుంది? ఇకపై ఎలా ఉంటుంది?

దిశ, ఫీచర్స్ : నమస్కారం మేడమ్.. నా వయస్సు 28 సంవత్సరాలు. మా వారి వయస్సు 46. మాకు ముగ్గురు పిల్లలు. ఒక అమ్మాయి పెళ్లి చేశాం. మా వారు నేను అన్యోన్యంగా ఉండేవాళ్లం. కానీ ఈ మధ్య మా ఇంట్లో పని చేసే పనిమనిషితో సంబంధం పెట్టుకున్నాడని అనుమానంగా ఉంది. ఆమె వయస్సు సుమారు 48 సంవత్సరాలు. గతంలో మేం సెక్స్‌లో పాల్గొన్నప్పుడు వీర్యం కింద పడేది. ఈ మధ్య నేను బజారుకు వెళ్లి వచ్చేసరికి బెడ్‌పై అలాగే వీర్యం పడి ఉంది. ‘ఇది ఏంటని’ మా వారిని అడిగాను. ‘నువ్వు ఊరికే అనుమానపడుతున్నావని, అలాగైతే నేనేం చేయలేనని’ తప్పించుకుంటున్నాడు. నాకేం చేయాలో అర్ధం కాక సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. కానీ పిల్లలు గుర్తొచ్చి ఆ పని చేయలేకపోయాను. నేను పవిత్రంగా ఉన్నప్పుడు తను కూడా అలాగే ఉండాలనుకుంటాను. నాకు ఇప్పుడు తనతో సెక్స్ అంటేనే విరక్తి కలుగుతోంది. తనతో కలిస్తే ఎయిడ్స్ వస్తుందేమో అన్న భయం వేస్తోంది. మా పని మనిషికి ఇంకా నలుగురైదుగురితో సంబంధం ఉందని అంటున్నారు. మేడమ్.. దయచేసి నేనేం చేయాలో సలహా ఇవ్వండి.
నువ్వు ఒక రోజు సుదీర్ఘంగా మాట్లాడావు. చాలా దుఃఖపడ్డావు. పని మనిషికి, మీ అయనకు సంబంధం ఉందని నీ అనుమానంగా చెప్పావు. ఆయనతో కలవాలంటేనే భయమేస్తోంది.. మీ ఆయన కూడా అలాంటిదేమీ లేదని ఒట్టు వేశాడని చెప్పావు. మంచం పక్కన నేలమీద వీర్యపు చుక్కలు నువ్వు లేని సమయంలో ఉండటమే నీ అనుమానానికి కారణం. ప్రత్యక్షంగా నువ్వు వారిని పట్టుకోలేక పోయావు. సాక్ష్యాలు కూడా లేవు. పనిమనిషికి మరికొంత మందితో సంబంధం ఉందని రాశావు. సరే నీ అనుమానమే నిజమనుకుందాం. చనిపోవాలని ఉన్నా పిల్లల కోసం బతుకుతున్నా అన్నావు. దీంట్లో నీ రాజీ ధోరణి కనిపిస్తోంది. కలిసే ఉంటానని చెప్పావు. చాలా కుటుంబాలు స్త్రీల త్యాగాల మీదే నిలుస్తాయి. ఇది అనాదిగా జరుగుతున్నదే. అతనితో ఉండాలనుకుంటున్నావు. కాబట్టి వెంటనే అతనికి హెచ్ఐవి టార్చ్ 10 ఫ్రొఫైల్ చేయించు. దీనిలో అతనికి సుఖ రోగాలున్నాయో లేదో తెలుస్తుంది. నువ్వు జాగ్రత్త పడొచ్చు. సహచర్యంలో మోసం తట్టుకోలేనంత బాధ కలిగిస్తుంది. అవమానం మిగిలి ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. కానీ పిల్లల భవిష్యత్తు స్త్రీలలో అన్నింటినీ అధిగమించి.. కొత్త శక్తిని నింపి.. గాయాలు మర్చిపోయేలా చేసి జీవితంలో ముందుకు నడిపిస్తుంది. నీ భర్త ద్రోహం తట్టుకోలేకపోతే విడిపోవడం... లేదా.. పిల్లల కోసం కలిసి ఉంటూనే అతడిని దూరంగా పెడుతూ నీ ఆత్మగౌరవాన్ని నిలుపుకోవడం... ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది. నువ్వు అందరి స్త్రీలలాగా రెండోది ఎంచుకున్నావు. మీ ఆయన చేసిన తప్పుకు, నువ్వు పతివ్రత కాకుండా ఉండటానికి ఏమిటి సంబంధం? అసలు, పతివ్రత అన్న పదమే స్త్రీల ఆత్మగౌరవాన్ని కించపరిచే తిట్టు లాంటి పదం. తప్పులు చేస్తే చెడ్డవారు, లేకపోతే మంచి వారు అవుతారు తప్ప సీత-రాముడి కొలమానాలు ఎప్పుడూ తప్పవుతాయి. ఎందుకంటే.. ఇంకొకరిలా ఉండాలనుకోవడమే తప్పు. తను తన లాగే ఉండాలి. తప్పు చేస్తే సరిదిద్దుకుంటూ ముందుకెళ్లాలి.






