- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Doctor Advice : ఆడవారిలా ఛాతీ పెరుగుతోంది.. మందులతో తగ్గుతుందా?
అంగస్తంభన తక్కువగా ఉండడంతో అనుమానంతో యూరాలజిస్ట్‌ని కలిశాను. టెస్టులు చేస్తే ఆలిగో స్పర్మియా అని వచ్చింది. వీర్యకణాలు చాలా తక్కువగా ఉన్నాయని మందులు వాడమన్నారు.

ప్రశ్న: మేడం గత ఐదేళ్ల నుంచి హైపోథైరాయిడిజంతో బాధపడుతున్నాను. అంగస్తంభన తక్కువగా ఉండడంతో అనుమానంతో యూరాలజిస్ట్‌ని కలిశాను. టెస్టులు చేస్తే ఆలిగో స్పర్మియా అని వచ్చింది. వీర్యకణాలు చాలా తక్కువగా ఉన్నాయని మందులు వాడమన్నారు. 150గా ఉన్న థైరాయిడ్ ఇప్పుడు పరీక్షల తర్వాత 125గా మారింది. జుట్టు బాగా రాలుతోంది. గడ్డంలో తెల్ల వెంట్రుకలు ఎక్కువవుతున్నాయి. ఛాతీ పెరుగుతూ ఆడవారి వక్షోజాల్లాగా తయారవుతున్నది. అవమానంగా, సిగ్గుగా ఉంది. రక్తంలో prolactin అనే హార్మోన్ పెరగడం దీనికి కారణమా ? మందులతో సమస్య తగ్గుతుందా ? - బీకేఆర్, వైజాగ్
జవాబు : మీరు కలవాల్సింది యూరాలజిస్ట్‌ని కాదు.. సెక్స్ లోపాలను చూసే ఆండ్రాలజిస్ట్‌ని. టెస్టోస్టెరాన్ అనే సెక్స్ హార్మోన్లు తక్కువగా ఉండడంతో పాటుగా ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉండటం వల్ల మీకు ఆడవారిలా వక్షోజాలు పెరుగుతున్నాయి. హైపోథైరాయిడిజం వల్ల టెస్టోస్టెరాన్ హార్మోన్లలో అపసవ్యత ఏర్పడుతుంది. మీరు ఫేస్ చేస్తున్న అంగస్తంభన లోపం వస్తుంది. వీర్యకణాల సంఖ్య తగ్గుతుంది. కాబట్టి ఆండ్రాలజిస్ట్‌ని కలిసి హార్మోనల్ ట్రీట్మెంట్ చేయించుకోండి. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. చికిత్స ఉంది. ఒకసారి సెక్సువల్ హెల్త్ కౌన్సిలింగ్ కూడా తీసుకోండి.
డాక్టర్ భారతి
సెక్సువల్ హెల్త్ &ఫ్యామిలీ కౌన్సెలర్
ప్రీ & పోస్ట్ మేరేజ్ &
సెక్సువల్ కౌన్సెలింగ్
86885 19225






