Sex & Science : హస్తప్రయోగం చేస్తే మొటిమలు వస్తాయా ?

by Bhoopathi Nagaiah |   (  Updated:2025-04-25 14:13:41  IST  )

మేడం.. నా వయసు 18. నేను రోజూ హస్తప్రయోగం (masturbation) చేసుకుంటాను.

Sex & Science : హస్తప్రయోగం చేస్తే మొటిమలు వస్తాయా ?
X

మేడం.. నా వయసు 18. నేను రోజూ హస్తప్రయోగం (masturbation) చేసుకుంటాను. ఈ మధ్య ఎందుకో నా ముఖం నిండా మొటిమలు వస్తున్నాయి. నా అలవాటుకి సమస్యకి ఏమైనా సంబంధం ఉందా? - శ్రీను, మెదక్.

జవాబు : హస్త ప్రయోగానికి ముఖం మీద పొక్కులకు ఏమాత్రం సంబంధం లేదు. నువ్వు టీనేజీలో ఉండడం వలన హార్మోన్స్ స్థాయిలో అపసవ్యత వలన ముఖంపై ఎక్నేవల్ గారిస్ అంటే మొటిమలు వస్తాయి. ఇది మామూలే వాటిని గిల్లకుండా రోజుకు మూడుసార్లు మంచినీటితో కడుగుతూ మూడు రోజులకు ఒకసారి ఆవిరి పడుతూ ఉండాలి. కొవ్వు, నూనె పదార్థాలు తక్కువ చేయాలి. పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. మొటిమలు చీముతో ఉన్నా, వాపు, నొప్పి ఉన్నా యాంటీ బయాటిక్స్ నోటి మాత్రలుగా వాడాలి. పైపూతగా కొన్ని ఆయింట్మెంట్స్ వాడాల్సి ఉంటుంది. హస్తప్రయోగం వారానికి మూడుసార్లు చేసుకున్నా ఏమీ కాదు. కాకపోతే రోజుకు రెండు మూడు సార్లు చేసుకోవడంలాంటి అలవాటు ఉండకూడదు. హస్తప్రయోగానికి శరీరంలోని ఇతర ఆరోగ్య సమస్యలకు సంబంధము లేదు. అది తప్పేమో అన్న అపోహ వల్ల ఆందోళన, భయం, ఒత్తిడి కలుగుతాయి. ఇది నీ చదువు మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే దానివల్ల అంగ పరిమాణం తగ్గడం, వంకర పోవడం, నీరసం రావడం వంటివి జరగవు. ముందు నువ్వు బాగా చదువుకో.. వీటిమీద దృష్టి పెట్టొద్దు. ఈ అలవాటు అతిగా, వ్యసనంలా మారితే భవిష్యత్ లో పెళ్లి తర్వాత సమస్యలు వస్తాయి.

READ MORE ...

హస్తప్రయోగం చేస్తుంటే ఫ్రెన్యులం తెగింది.. నేను పెళ్లికి పనికి వస్తానా?

ఆమెను స్పర్శించగానే స్థలనం అయిపోయింది.. నేను పెళ్లి చేసుకోవాలా, వద్దా?


- డాక్టర్ భారతి, MS

మేరిటల్ కౌన్సెలర్

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్

👉 మరిన్ని సెక్స్ & సైన్స్ వార్తల కోసం సందర్శించండి

Next Story